/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-23T173242.450.jpg)
Ravi Teja : మాస్ మహారాజ్ రవితేజ డెబ్యూ డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ RT75. రవితేజ 75వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. హీరో సన్నివేశాలతో పాటు మరికొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
Gear up for an ultimate mass entertainer! 🔥🤙🏻
𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐉𝐀 @RaviTeja_offl ~ #RT75 Launched officially with a pooja ceremony today! 💫✨
Shoot begins from Today! 🔥
A Sankranthi 2025 Release. 🥳@sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo… pic.twitter.com/V6scL2SK01
— Sithara Entertainments (@SitharaEnts) June 11, 2024
రవితేజకు గాయాలు
అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పాల్గొంటున్న సమయంలో హీరో రవితేజకు ప్రమాదం జరిగింది. కుడిచేతికి పెద్దగా గాయమైంది. దీంతో చిత్ర యూనిట్ చికిత్స కోసం రవితేజను యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయాలను పరీక్షించిన వైద్యులు ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో రవితేజ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : మాజీ మంత్రికి బిగ్ రిలీఫ్.. కొడుక్కు బెయిల్..!