Hero Nikhil: హీరో నిఖిల్ తండ్రయ్యాడు.. వారసుడొచ్చాడని సంబరపడుతున్న ఫ్యాన్స్!

టాలీవుడ్ హీరో నిఖిల్, పల్లవి దంపతులకు పండంటి బిడ్డ పుట్టాడు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల ట్వీట్ చేశారు. నిఖిల్‌, పల్లవి దంపతులకు బాబు జన్మించినట్లు తెలిపారు. 

Hero Nikhil: హీరో నిఖిల్ తండ్రయ్యాడు.. వారసుడొచ్చాడని సంబరపడుతున్న ఫ్యాన్స్!
New Update

Hero Nikhil Blessed With a Baby Boy: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రయ్యారు. నిఖిల్, పల్లవి దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్నీ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. "నిఖిల్, పల్లవి దంపతులకు బేబీ బాయ్ పుట్టాడు . వారి కుటుంబంలోకి మరో సంతోషకరమైన చేరిక పై.. హృదయపూర్వక అభినందనలు" అంటూ నిఖిల్ తమ బాబును చేతిలో పట్టుకున్న బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నిఖిల్ అభిమానులు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిఖిల్ 2020 లో డాక్టర్ పల్లవి వర్మను ప్రేమించి వివాహం చేసుకున్నారు. కోవిడ్ కారణంగా వీరి పెళ్లి సింపుల్ గా అయిపోయింది. 2024 ఈ దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు.

Also Read:   ‘శీలావతిగా’.. అనుష్క.. 14 ఏళ్ళ తర్వాత మరో సారి క్రిష్, అనుష్క కాంబో రిపీట్

. @actor_Nikhil and his wife Pallavi are now blessed with a BABY BOY❤️

Warmest congratulations to the glowing couple on this delightful addition to their family 🤗✨ pic.twitter.com/sLhOeu87ss

— Ramesh Bala (@rameshlaus) February 21, 2024

ఇక హీరో నిఖిల్ సినిమాల విషయానికి వస్తే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీ డేస్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న నిఖిల్.. ఆ తర్వాత ఎన్నో మంచి అవకాశాలను అందుకున్నారు. రీసెంట్ గా కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నిఖిల్.. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం స్వయంభూ చిత్రంలో నటిస్తున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తున్నారు.

Also Read: Virushka: రెండో బిడ్డకు జన్మనిచ్చిన విరాట్-అనుష్క దంపతులు.. పేరు ఏంటో తెలుసా?

#nikhil-blessed-with-baby-boy #hero-nikhil
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe