Navdeep: డ్రగ్స్‌ కేసులో హీరో నవదీప్ ఔట్..!! నెక్స్ట్‌ టార్గెట్ వీళ్లేనా..?

మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో తనను అరెస్ట్ చేయొద్దని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నేడు మరోసారి నవదీప్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేయనుంది. కాగా, మరోవైపు నవదీప్ పై కౌంటర్ దాఖలు చేయనున్నారు నార్కోటిక్ పోలీసులు. ఈ నేపధ్యంలో డ్రగ్స్‌ కేసులో ఇవాళ హైకోర్టులో కీలక విచారణ జరగనుంది.

New Update
Navdeep: డ్రగ్స్‌ కేసులో హీరో నవదీప్ ఔట్..!! నెక్స్ట్‌ టార్గెట్ వీళ్లేనా..?

డ్రగ్స్ వ్యవహారం మరోసారి టాలీవుడ్ ను కుదిపేస్తోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నవదీన్ ను డ్రగ్స్ వినియోగదారుడిగా పోలీసులు పేర్కొన్నారు. పోలీస్ రెయిడ్స్ లో పట్టుబడిన రామ్ చంద్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంలో నవదీప్ తనతో కలిసి డ్రగ్స్ సేవించినట్టు రామ్ చంద్ తెలిపాడు. దీంతో, టీఎస్ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నవదీప్ ను కేసులో నిందితుడిగా చేర్చారు.

ఈ క్రమంలో, ఈ నెల 16న హైదరాబాద్ లోని నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో నవదీప్ ఇంట్లో లేడని సమాచారం. మరోవైపు తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని టీఎస్ హైకోర్టును నవదీప్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నవదీప్ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన హైకోర్టు.. ఈరోజు వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఈ నేపథ్యంలో, ఈరోజు హైకోర్టులో నవదీప్ కు సంబంధించి నార్కోటిక్ బ్యూరో కౌంటర్ దాఖలు చేయనుంది. గత నెల 31న మాదాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్స్ లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఈ పార్టీపై దాడి చేసిన నార్కోటిక్స్ బ్యూరో 12 మందిని అరెస్ట్ చేసింది. నవదీప్ ను కూడా అరెస్ట్ చేసి విచారించాలనే యోచనలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఉన్నారు.

బాలీవుడ్‌ నుండి టాలీవుడ్ వరకు..

ఒకప్పుడు బాలీవుడ్‌ సహా కొంత మంది ఉన్నత వర్గాలకు పరిమితమైన డ్రగ్స్ .. ఇపుడు అన్ని దక్షిణాది సినీ ఇండస్ట్రీస్‌‌లన్నింటికీ పాకిపోయింది. గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ కేసులో పలువురు హీరోలు, దర్శకులను ప్రశ్నించడం పెద్ద సంచలనమే సృష్టించింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి, హీరో నవదీప్, రవితేజ, సుబ్బరాజు, తరుణ్, నందు, తనీష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులను ప్రత్యేక విచారణ బృందం ఇన్వెస్టిగేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా డ్రగ్స్ కేసులో ప్రముఖ తెలుగు నిర్మాత కబాలి తెలుగు నిర్మా కేపీ చౌదరి అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.

రీసెంట్‌గా ఓ డ్రగ్స్ ముఠా సైబరాబాద్ పోలీసుల చేతికి చిక్కింది. ఈ కేసులో ప్రముఖ సినీ నిర్మాత, కబాలి ప్రొడ్యూసర్ కేపీ చౌదరిని (Kp Chowdary) పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా కేపీ చౌదరి గోవాలో ఉంటున్నారు. ఆయన మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్టు తేలడంతో ఆయనను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో కేబి.చౌదరికి సంబంధం ఉందని అరోపణలతో అతని పై నిఘా పెట్టి అరెస్ట్ చేయడం తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది. ఈ డ్రగ్స్ ఇష్యూలో ఇంకా ఎవరైనా సినీ నటుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Also Read: పాన్ ఇండియా మూవీని సమర్పిస్తోన్న రాజమౌళి…ఆసక్తి రేపుతున్న ట్వీట్

Advertisment
Advertisment
తాజా కథనాలు