/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-20T155514.759-jpg.webp)
Allu Arjun at Khairatabad RTO Office: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 (Pushpa 2) చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రం భారీ యాక్షన్ సన్నివేశాలతో సిద్ధమవుతోంది. డైరెక్టర్ సుకుమార్ కూడా పార్ట్ 1 మించి సెకండ్ పార్ట్ ఉండబోతున్నట్లు తెలిపారు. దీంతో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పుష్ప పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమా పాటలు, డైలాగ్స్ ట్రెండ్ అవుతున్నాయని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. పుష్ప తో బన్నీ ఇమేజ్ కూడా పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోయింది.
ఖైరతాబాద్ RTO ఆఫీస్ కు వెళ్లిన అల్లు అర్జున్
ఇది ఇలా ఉంటే.. తాజాగా ఖైరతాబాద్ RTO ఆఫీస్ కు వెళ్లారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అక్కడ అధికారులను కలిసి కాసేపు ముచ్చటించిన బన్నీ.. తన ఇంటర్ నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
.@alluarjun visits #Khairatabad RTO office for international driver’s licence. @newstapTweets pic.twitter.com/zBlcA71fvA
— Saye Sekhar Angara (@sayesekhar) March 20, 2024