తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ తెలుగు దర్శకుడు, నిర్మాత కొమారి జానయ్య నాయుడు (44) కన్నుమూశారు. కూకట్‌పల్లిలోని భాగ్యనగర్ కాలనీలోని ఒక ఓయో లాడ్జీలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి
New Update

Director Komari Janaiah Naidu : తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. తెలుగు దర్శకుడు, నిర్మాత కొమారి జానయ్య నాయుడు (44) కన్నుమూశారు. కూకట్‌పల్లిలోని భాగ్యనగర్ కాలనీలోని ఒక ఓయో లాడ్జీలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. జానయ్య నాయుడు తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్‌పై 'జీఎస్టీ' (గాడ్ సైతాన్ టెక్నాలజీ) అనే సినిమాను నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు.

Also Read : ఆ ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ తీస్తా : హరీష్ శంకర్

ఏం జరిగిందంటే...

జానయ్య నాయుడు కూకట్‌పల్లిలోని భాగ్యనగర్ కాలనీలోని ఓయోలో ఉండేందుకు రూమ్‌ బుక్‌ చేసుకున్నాడు. ఆయన చెక్‌ ఆవుట్‌ చేయాల్సిన సమయం పూర్తి కావడంతో లాడ్జి సిబ్బంది గది తలుపులు కొట్టగా జానయ్య ఓపెన్‌ చేయలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీ నుంచి చూడగా ఆయన ఫ్యాన్‌కు వేలాడుతు కనిపించాడు. దీంతో వెంటనే వారు పోలీసులకు ఫోన్‌ చేయడంతో ఘటనాస్థలానికి చేరుకున్న వారు కేసు నమోదు చేసుకున్నారు. ఆయన మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది.

#director-komari-janaiah-naidu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe