CM Revanth Reddy: వరుసగా రేవంత్‌ రెడ్డిని కలుస్తున్న సినీ ప్రముఖుల.. తాజాగా మరో ఇద్దరు

రాఘవేంద్రరావు, చిరంజీవి, నాగార్జున.. ఇప్పుడు తాజాగా శివారెడ్డి, నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ రేవంత్‌ రెడ్డిని కలిశారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్‌ రెడ్డిని వరుసగా సినీ ప్రముఖులు కలిసి.. అభినందనలు తెలియజేస్తున్నారు.

CM Revanth Reddy: వరుసగా రేవంత్‌ రెడ్డిని కలుస్తున్న సినీ ప్రముఖుల.. తాజాగా మరో ఇద్దరు
New Update

CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. CM రేవంత్ రెడ్డిని వరుసగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి.. ఆ తర్వాత నాగార్జున సతీమణి అమలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఆ తరువాత రేవంత్ రెడ్డితో కాసేపు ముచ్చటించారు.

Also Read: JR NTR: కొద్దిలో మిస్ అయ్యా.. జపాన్ భూకంపం పై జూనియర్ ఎన్ఠీఆర్ ట్వీట్

ఇక తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా మరో ఇద్దరు ప్రముఖులు రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh)... ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అలాగే కొత్త సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలిపారు. ప్రముఖ మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డి (Actor Shiva Reddy), ఆయన శ్రీమతి స్వాతి రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి.. పుష్ప గుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ సినిమాటోగ్రాఫర్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

Also Read: Sitara Latest Photos: మహేష్ గారాల పట్టి ఎంత క్యూట్ గా ఉందో.. ఫొటోలు చూస్తే మీకే అర్థమవుతుంది!

#shiva-reddy-met-cm-revanth-reddy #cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe