/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-8-5.jpg)
Actor Nithin :టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తండ్రయ్యారు. ఆయన సతీమణి షాలిని కందుకూరి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నితిన్ తన ఎక్స్ వేదికగా తెలుపుతూ.. మా ఫ్యామిలీలోకి వచ్చిన సరికొత్త స్టార్‌కి స్వాగతం అంటూ ఫొటో పంచుకున్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు నితిన్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Welcoming the NEWEST STAR 🌟 of our family!! ❤️ pic.twitter.com/otBHvwSnNo
— nithiin (@actor_nithiin) September 6, 2024
Also Read : రాజమౌళి బర్త్ డే స్పెషల్.. ‘SSMB 29’ నుంచి అప్డేట్
కాగా నితిన్ 2020 లో శాలినిని పెళ్లి చేసుకున్నాడు. వీరిది ప్రేమ వివాహం. షాలిని ప్రెగ్నెంట్ కావడంతో గత రెండు నెలల నుంచి షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే భార్యను దగ్గరుండి చూసుకున్నాడు. ప్రస్తుతం ఆయన రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న 'రాబిన్ హుడ్' డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow Us