జైల్లోబాబు..ఢిల్లీలో లోకేశ్..ఇక్కడ భువనేశ్వరి... నేడు టీడీపీ నిరాహారదీక్షలు..!!

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ స్కీం స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుఅరెస్టు ను ఖండిస్తూ..సత్యమేవ జయతే పేరుతో ఇవాళ టీడీపీ నిరాహారదీక్షలు చేపట్టనుంది. జైళ్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్,రాజమండ్రి లో భువనేశ్వరి దీక్షలు చేపట్టనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. చంద్రబాబు పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని నిరసనగా టీడీపీ ఈ దీక్షకు పిలుపునిచ్చింది. సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు దీక్షలో పాల్గొనాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

Chandrababu: దీక్షకు సిద్దమైన చంద్రబాబు.. ఎప్పుడంటే.!
New Update

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ స్కీం స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుఅరెస్టు ను ఖండిస్తూ..సత్యమేవ జయతే పేరుతో ఇవాళ టీడీపీ నిరాహారదీక్షలు చేపట్టనుంది. జైళ్లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్,రాజమండ్రి లో భువనేశ్వరి దీక్షలు చేపట్టనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. చంద్రబాబు పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని నిరసనగా టీడీపీ ఈ దీక్షకు పిలుపునిచ్చింది. సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు దీక్షలో పాల్గొనాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. అంతేకాదు ఇవాళ సాయంత్రం 7గంటలకు అందరూ 5 నిమిషాల పాటు లైట్లు ఆర్పేసీ..కొవ్వొత్తులతో నిరనసన తెలిపాలని టీడీపీ కోరింది.

ఇది కూడా చదవండి: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. ఆ రోజు ఆలయం మూసివేత.. కారణమిదే..!!

ఇవాళ నిరాహార దీక్ష చేపడుతుండటానికి ప్రధాన కారణం నేడు గాంధీ జయంతి. నిరసనలను శాంతి యుత మార్గంలో చేపట్టాలని గాంధీ పిలుపునిచ్చారు. అందుకే సత్యమేవ జయతే పేరుతో నిరాహార దీక్షను శాంతియుతంగా చేపడుతున్నారు. చంద్రబాబు జైల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేస్తారని టీడీపీ తెలిపింది. ఈ విషయాన్ని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబుకు మద్దతుగా దీక్ష చేపడతారని తెలిపింది. ఢిల్లీలో టీడీపీ ఎంపీ కనకమేడల నివాసంలో లోకేశ్ దీక్ష చేపడుతున్నట్లు సమాచారం. లోకేశ్ తోపాటు టీడీపీ ఎంపీలు కూడా దీక్షలో పాల్గొంటారని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: ఈ ఫుడ్స్ తింటే.. మీ ఊపిరితిత్తులు సేఫ్..!!

చంద్రబాబు విసయంలో ఇప్పటికే మూడు కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కీం కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎలైన్ మెంట్ మార్పుల కేసు, ఫైబర్ గ్రిడ్ కేసుతో పాటు మరో కేసు జాబితాలో చేరింది. పాతకేసైన ఓటుకు నోటు కేసు ఇప్పుడు మరింత యాక్టివ్ గా మరింది. దీనిపై అక్టోబర్ 4వ తేదీని సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి డబ్బుఇవ్వాలని చూశారు. దీంతో అడ్డంగా దొరికిపోయారు. అప్పటి కేసు ఇప్పుడు టీడీపీకి మరోసారి తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది.

#chandrababu-naidu #tdp-hunger-strikes #ap
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe