Today Stock Market: నష్టాల్లో కదులుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. పేటీఎం షేర్లు 4 శాతం జంప్!

అమెరికా ఫెడ్ సమావేశం ఈరోజు జరుగనుంది. సమావేశ వివరాలు రేపు వెల్లడి కానున్నాయి. ఈ నేపద్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. ఈరోజు మార్చి 19న 11 గంటల సమయానికి సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా దిగజారింది. 30 సెన్సెక్స్ స్టాక్‌లలో, 28 షేర్లు క్షీణించాయి. 

New Update
Stock Market: బడ్జెట్ ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్

Today Stock Market: ఈరోజు అంటే మార్చి 19న స్టాక్ మార్కెట్‌లో క్షీణత కనిపిస్తోంది. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా పతనంతో 72,100 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ కూడా 200 పాయింట్లకు పైగా పడిపోయి, 21,850 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ప్రారంభ ట్రేడింగ్ సమయంలో, 30 సెన్సెక్స్ స్టాక్‌లలో, 28 క్షీణించగా రెండు షేర్లు మాత్రమే పెరుగుతున్నాయి. ఐటీ, మెటల్, ఆటో షేర్లలో మరింత క్షీణత ఉంది. TCS షేర్లు 2% కంటే ఎక్కువ క్షీణతను చూస్తున్నాయి. 

Today Stock Market: మార్కెట్లో పాపులర్ వెహికల్స్ సర్వీసెస్ షేర్ల లిస్టింగ్ బలహీనంగా ఉంది. దీని షేర్లు 1.9% తగ్గింపుతో NSEలో రూ. 289.2 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇది 1.02% తగ్గింపుతో BSEలో రూ. 292 వద్ద లిస్ట్ అయింది.  దీని ఇష్యూ ధర రూ.295లుగా ఉంది. 

Paytm షేర్లు పైకి.. 
Today Stock Market: Paytm షేర్లు ఈరోజు 4% పైగా పెరిగాయి. అంతకుముందు నిన్న ఇది 5% ఎగువ సర్క్యూట్‌ను కలిగి ఉంది. ఎస్ సెక్యూరిటీస్ ఈరోజు Paytmని రూ. 505 టార్గెట్ ధరతో అప్‌గ్రేడ్ చేసింది.  మార్కెట్‌లో లిస్టింగ్ అయిన తర్వాత మొదటిసారిగా ఇది  'బై' రేటింగ్‌ను పొందింది.

Also Read: దూసుకుపోతున్న క్రిప్టో మార్కెట్.. ఇన్వెస్టర్స్ కోసం కొత్త కరెన్సీ రెడీ 

అదే కారణం కావచ్చు.. 
Today Stock Market: షేర్ మార్కెట్లో తగ్గుదలకు ఫెడ్ సమావేశమే కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం ప్రారంభం అవుతుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బుధవారం అంటే మర్చి 20న ఫెడ్ చైర్మన్ జెరోమ్‌ పావెల్‌ ప్రకటిస్తారు. ఇప్పటివరకూ ఫెడ్ వడ్డీరేట్లను తగ్గించవచ్చని భావిస్తూ వచ్చారు. కానీ, తాజాగా అమెరికా కన్స్యూమర్ ఇండెక్స్ ఫిబ్రవరి ద్రవ్యోల్బణం వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదు అయింది. దీంతో ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్ లేదని భావిస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను మార్పులు లేకుండా అంటే 5.25 - 5.5% మధ్య ఉంచవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన స్టాక్ మార్కెట్ ఇండెక్స్ తగ్గుదల చూస్తోందని నిపుణుల అంచనా. ఫెడ్ వడ్డీ రేట్లతో పాటు.. జపాన్, ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంకుల ద్రవ్య విధానాలు కూడా ఈ రెండు రోజుల్లోనే వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్స్ జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తోందని ఆర్థిక వేత్తలు అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు