Voter Registration: నేటితో ముగియనున్న తెలంగాణ ఓటరు నమోదు గడువు

తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదుకు ఈరోజుతో గడువు ముగియనుంది. అర్హులైన మిస్ అవ్వకుండా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. ప్రస్తుతం ఓటరు నమోదుకు మాత్రమే వీలుంటుందని, మార్పులు, చేర్పులకు అవకాశం లేదని సీఈసీ ప్రకటించింది.

Elections : రాష్ట్రంలో నిన్నటితో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ!
New Update

Voter Registration in Telangana: తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు (Telangana Elections) జరగనున్నాయి. వీటికి కావల్సిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలయిపోతుంది. మరోవైపు కొత్త ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఈరోజు కేవలం కొత్త ఓటు నమోదు చేసుకునేందుకు మాత్రమే ఆఖరు తేదీ. కానీ సవరణలు, మార్పులకు మాత్రం ఇంకా అవకాశం ఉంది.

Also Read:చంద్రబాబుకు బిగ్ రిలీఫ్…మధ్యంతర బెయిల్ ను ఇచ్చిన హైకోర్టు

కొత్త ఓటరు నమోదు, మార్పులకు www.nvsp.in వెబ్ సైట్, voter helpline అనే యాప్ ను ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యే వారు ఓటు నమోదు చేసుకోవచ్చని భారత ఎన్నికల కమిషన్ చెప్పింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు బీఎల్‌వోల ద్వారా ఆఫ్‌లైన్‌లో ఫారం-6 (Form 6) అప్లికేషన్లు తీసుకున్న ఎన్నికల సంఘం ఇప్పుడు దాన్ని ఆన్‌లైన్‌కే పరిమితం చేసింది. ఓటరుగా పేరు నమోదు చేసుకునే వారు మీసేవా కేంద్రాలతోపాటు ఓటరు హెల్ప్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు.

ఏదైనా సమాచారం తెలుసుకోవడానికి టోల్‌ఫ్రీ 1950 నంబర్‌కు కాల్‌ చేయడానికి వెలుసుబాటును కూడా ఎన్నికల కమిషన్‌ కల్పించింది. దీంతో పాటూ ఓటరు జాబితాలో పేరున్న వారు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని సూచించారు.ఈ అవకాశం చెయ్యి దాటితే యువతకు ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కోల్పోయినట్లే. పౌరులుగా ఓటు కలిగి ఉండడం ప్రతి ఒక్కరి హక్కు...అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతోంది ఎన్నికల సంఘం.

Also Read:అమ్మకానికి 81.5 కోట్ల ఇండియన్ ఆధార్ వివరాలు..డేటా హ్యాక్

#telangana-election-2023 #voter-registration #telengana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe