Today Gold Rate : స్థిరంగా బంగారం ధరలు.. కాస్త తగ్గిన వెండి ధరలు కొన్నిరోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు వరుసగా రెండో రోజూ స్థిరంగా ఉన్నాయి. మార్కెట్ ప్రారంభ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,950, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,040 గా ఉంది. కేజీ వెండి ధర ₹ 92,900 గా ఉంది. By KVD Varma 27 Aug 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Today Gold Rate : బంగారం ధరలు వరుసగా రెండోరోజూ స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతూ ఉండడంతో మన దేశంలోనూ ఆ ప్రభావం కనిపిస్తోంది . అయితే , స్థానికంగా ఉన్న డిమాండ్ తో ధరలు మార్పులు లేకుండా నిలిచాయి. ఇక వెండి విషయానికి వస్తే ఈరోజు వెండి ధరలు కాస్త తగ్గుదల కనబరిచాయి . మొత్తంగా చూసుకుంటే ఈరోజు అంటే ఆగస్టు 27 బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. అదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి 22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,950 24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 73,040 ఇక విజయవాడ , విశాఖపట్నం , తిరుపతి లలోనూ బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి . ఆ ప్రాంతాల్లో ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి . 22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,950 24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 73,040 దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి . ఈరోజు ఎటువంటి మార్పులు లేకుండా కింది విధంగా బంగారం రేట్లు కొనసాగుతున్నాయి . 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ₹ 67,100 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 73,190 బంగారం ధరలు స్థిరంగా ఉంటే . . మరోవైపు ఇటీవల వరుసగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలు చాలా స్వల్పంగా తగ్గాయి . హైదరాబాద్ లోనూ , ఢిల్లీలోనూ కూడా కేజీకి 100 రూపాయల తగ్గుదల కనిపించింది . హైదరాబాద్ లో వెండి ధర కేజీకి.. ₹ 92,900 గానూ , ఢిల్లీలో వెండి ధర కేజీకి ₹ 87,900 గానూ ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్నాయి . ఇక అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి . ఈరోజు అంటే ఆగస్టు 27 ఉదయం 7 గంటల సమయానికి అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సు 2,512 డాలర్ల వద్ద ఉన్నాయి . అలాగే వెండి ధరలు కాస్త పెరుగుదలతో కేజీకి 962 డాలర్లుగా ఉన్నాయి . గమనిక : ఇక్కడ ఇచ్చిన బంగారం , వెండి ధరలు ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్న ధరలు. బులియన్ మార్కెట్ వెబ్సైట్ ఆధారంగా వీటిని ఇవ్వడం జరిగింది . వీటికి పన్నులు అదనంగా ఉంటాయి . అంతేకాకుండా , బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి . అంతర్జాతీయంగా వచ్చే మార్పులు , స్థానికంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం , వెండి ధరలు మారుతూ వస్తాయి. బంగారం , వెండి కొనాలని అనుకున్నపుడు అన్ని విషయాలను పరిశీలించి కొనుగోలు చేయాలని సూచిస్తున్నాం. Also Read : నాకేం తెలియదు..నేను వెళ్లేసరికే ఆమె చనిపోయింది! #silver-price #gold-rates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి