Today Gold Rate : స్థిరంగా బంగారం ధరలు.. కాస్త తగ్గిన వెండి ధరలు

కొన్నిరోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు వరుసగా రెండో రోజూ స్థిరంగా ఉన్నాయి. మార్కెట్ ప్రారంభ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,950, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,040 గా ఉంది. కేజీ వెండి ధర ₹ 92,900 గా ఉంది.

New Update
Today Gold Rate : స్థిరంగా బంగారం ధరలు.. కాస్త తగ్గిన వెండి ధరలు

Today Gold Rate : బంగారం ధరలు వరుసగా రెండోరోజూ స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతూ ఉండడంతో మన దేశంలోనూ ఆ ప్రభావం కనిపిస్తోంది .  అయితే ,  స్థానికంగా ఉన్న డిమాండ్ తో ధరలు మార్పులు లేకుండా నిలిచాయి. ఇక వెండి విషయానికి వస్తే ఈరోజు వెండి ధరలు కాస్త తగ్గుదల కనబరిచాయి .  మొత్తంగా చూసుకుంటే ఈరోజు అంటే ఆగస్టు 27 బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. అదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈరోజు హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి 

22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,950 

24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 73,040  

ఇక విజయవాడ ,  విశాఖపట్నం , తిరుపతి లలోనూ బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి .  ఆ ప్రాంతాల్లో ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి .  

22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,950 

24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 73,040  

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి .  ఈరోజు ఎటువంటి మార్పులు లేకుండా కింది విధంగా బంగారం రేట్లు కొనసాగుతున్నాయి .  

 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ₹ 67,100

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 73,190 

బంగారం ధరలు స్థిరంగా ఉంటే . . మరోవైపు ఇటీవల వరుసగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలు చాలా స్వల్పంగా తగ్గాయి .  హైదరాబాద్ లోనూ ,  ఢిల్లీలోనూ కూడా కేజీకి 100 రూపాయల తగ్గుదల కనిపించింది .

హైదరాబాద్ లో వెండి ధర కేజీకి.. ₹ 92,900 గానూ ,  ఢిల్లీలో వెండి ధర కేజీకి ₹ 87,900 గానూ ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్నాయి .  

ఇక అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి .  ఈరోజు అంటే ఆగస్టు 27 ఉదయం 7 గంటల సమయానికి అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సు 2,512 డాలర్ల వద్ద ఉన్నాయి .  అలాగే వెండి ధరలు కాస్త పెరుగుదలతో కేజీకి 962 డాలర్లుగా ఉన్నాయి .

publive-image

గమనిక :  ఇక్కడ ఇచ్చిన బంగారం ,  వెండి ధరలు ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్న ధరలు. బులియన్ మార్కెట్ వెబ్సైట్ ఆధారంగా వీటిని ఇవ్వడం జరిగింది .  వీటికి పన్నులు అదనంగా ఉంటాయి .  అంతేకాకుండా , బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి .  అంతర్జాతీయంగా వచ్చే మార్పులు ,  స్థానికంగా  ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ,  వెండి ధరలు మారుతూ వస్తాయి. బంగారం ,  వెండి కొనాలని అనుకున్నపుడు అన్ని విషయాలను పరిశీలించి కొనుగోలు చేయాలని సూచిస్తున్నాం.

Also Read : నాకేం తెలియదు..నేను వెళ్లేసరికే ఆమె చనిపోయింది!

Advertisment
తాజా కథనాలు