Gold Rate: గతవారంలో ఎగసిపడ్డ బంగారం ధరలు.. మరి ఈరోజు ఎంత ఉన్నాయో తెలుసా?

గత వారంలో బంగారం, వెండి ధరలు బాగా పెరిగాయి. ఈరోజు బంగారం ధరలు గత వారాంతంలో ఉన్న రేట్ల వద్ద స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్లు 10 గ్రాములకు 56,550లు గానూ, 24 క్యారెట్లు 10 గ్రాములకు రూ. 61,690లుగానూ ఉంది.  వెండి ధర కేజీకి 79,500 వద్ద కొనసాగుతోంది. 

Gold Rate: గతవారంలో ఎగసిపడ్డ బంగారం ధరలు.. మరి ఈరోజు ఎంత ఉన్నాయో తెలుసా?
New Update

Gold Rate: బంగారం అంటేనే మన దేశంలో అందరికీ ఎంతో ఇష్టం. పెళ్లి.. పండగ.. వేడుక ఏదైనా బంగారం కొనాలని అందరూ.. ముఖ్యంగా అతివలు ఉత్సాహపడుతుంటారు. అంతేకాదు పెట్టుబడి విషయంలో కూడా బంగారంపై చేసే ఇన్వెస్ట్మెంట్ సురక్షితమే కాకుండా.. దీర్ఘకాలికంగా మంచి రాబడులను అందిస్తుందని నమ్ముతారు. అందుకే ప్రతి రోజు బులియన్ మార్కెట్ పై అంటే.. బంగారం ధరల తీరుపై ఓ లుక్కేసి ఉంచుతారు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రతిరోజూ పసిడి ఎంత ఉంది అని ఆసక్తిగా తెలుసుకుంటూ ఉంటారు. 

గతవారం అంతా బంగారం, వెండి ధరలు(Gold Rate) పరుగులు తీశాయి. వారం ప్రారంభంలో ఉన్న ధరలకంటే వారాంతానికి వచ్చేసరికి బంగారం, వెండి ధరల్లో బాగా పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడం.. దేశీయంగానూ డిమాండ్ పెరగడంతో మన దేశంలోనూ బంగారం ధరలు బాగా పెరిగాయి. ఇక ఈరోజు అంటే సోమవారం (20.11.2023) బంగారం ప్రారంభ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 

హైదరాబాద్ లో గత వారాంతానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550లు గాఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,690లుగా నిలిచింది. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 56,550లు గానూ.. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 61,690లుగానూ స్థిరంగా ఉంది. 

Also Read: ఆగని బంగారం ధరల పరుగు.. 80వేలకు దగ్గరలో వెండి..

ఇక హైదరాబాద్ లో వెండి ధర కేజీకి వారాంతంలో ఉన్న రూ.79,500ల వద్ద ఈరోజు కూడా కొనసాగుతోంది. గత వారంలో వెండి ధరలు అనూహ్యంగా పరుగులు తీశాయి. మూడు రోజుల వ్యవధిలో 2 వేల రూపాయలకు పైగా ఎగబాకి 80 వేల రూపాయలను టచ్ చేసే దిశగా దూసుకుపోయాయి. 

ఇక ఢిల్లీ మార్కెట్లోనూ ఈరోజు బంగారం ధరలు(Gold Rate) మార్పులు లేకుండా ఉన్నాయి. 22 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 56,700 మార్కు వద్ద -  24 క్యారెట్ల గోల్డ్ రేటు కొద్దిగా అంటే రూ. 50 పెరిగి 10 గ్రాములకు రూ. 61,840 వద్ద ఉంది. అదేవిధంగా వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. ఢిల్లీలో కేజీ వెండి ధరలు 76వేల రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. 

అలాగే, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ కు 1982 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికి వస్తే.. ఇది మాత్రం ఔన్సుకు 23.67 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 

గమనిక: ఇక్కడ అందించిన ధరలు ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్న ధరలు. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అలాగే, స్థానికంగా ఉండే డిమాండ్, టాక్స్ లు వంటివి కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల బంగారం కొనాలి అనుకున్నపుడు మార్కెట్ ధరలను ఒకసారి పరిశీలించడం అవసరం.

Watch this Interesting video:

#gold-and-silver-latest-prices #gold-and-silver-price
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe