పండుగ వేళ బంగారం, వెండి కొనేవారు చాలా మంది ఉంటారు. ధంతేరాస్ నాడు బంగారం కొంటే మంచిదని భావించే వారు చాలా మంది ఉంటారు. అలా బంగారం కొనుగోలు చేసిన వారు అధిక సంఖ్యలోనే ఉన్నారు. అది కాకుండా ఇప్పుడు పెళ్లి ముహుర్తాలు బాగా ఉండడంతో గత కొద్ది రోజులుగా బంగారానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది.
దాంతో శనివారం నాడు బంగారం , వెండి ధరలు కొంచెం పెరిగాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు బంగారం , వెండి ధరలు మార్కెట్లో భారీగా తగ్గాయి. ఆదివారం నాడు 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 55,550 ఉండగా..24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,600 లు గా ఉంది.
22 క్యారెట్ల బంగారం పై రూ. 450 , 24 క్యారెట్ల పై రూ. 490 మేర ధరలు తగ్గింది. వెండి కిలో ధర రూ. 1000 మేర తగ్గి..రూ. 73,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే...ఢిల్లీలో..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,700 గా ఉంటే..24 క్యారెట్ల ధర రూ. 60,750 లుగా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,550 లుగా ఉండా..24 క్యారెట్లు రూ.60,600 వద్ద కొనసాగుతుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ. 55,550 గా ఉండగా..24 క్యారెట్లు రూ.60,630 లుగా కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.56 వేలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల ధర రూ. 60, 600 గా నమోదు అవుతుంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,550 లుగా ఉండగా..24 క్యారెట్ల ధర రూ. 60,630 లుగా కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 55,550 లుగా ఉండగా...24 క్యారెట్ల ధర రూ. 60,630 గా ఉంది.
బంగారం ధరలతో పాటు..వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..ఢిల్లీలో వెండి కిలో ధర రూ. 73,000 గా ఉండగా..ముంబైలో రూ.73,000గా ఉంది. చెన్నైలో రూ.76 వేలు, బెంగుళూరులో రూ.72,750 గా ఉంది. కేరళలో రూ. 76,000 గా ఉండగా..కోల్‌కతాలో రూ.73,000 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.76,000 గా ఉంది.
Also read: దీపావళి నాడు దానం చేయకూడని వస్తువులు ఏంటో తెలుసా!