Gold and Silver Price : రెండు రోజులపాటు నిలకడగా ఉండి.. బుధవారం పెరుగుదల బాట పట్టిన బంగారం.. అదే దారిలో పయనిస్తోంది. వరుసగా రెండోరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో ఉన్న బంగారం ధరలు ఈ పెరుగుదలతో మరింత పైకి చేరుకున్నాయి. బంగారం ధరల పరుగులు ఎప్పుడు ఆగుతాయో అని బంగారం కొనాలని అనుకునే వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఇప్పట్లో ఆ అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగుతూనే ఉంది. డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. దీంతో దేశీయంగా బంగారం ధరలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి. మధ్యలో కాస్త ఊరట ఇచ్చినట్టు కనిపించినా.. బంగారం ధరల పెరుగుదల మాత్రం ఆగడం లేదు. ఈరోజు అంటే డిసెంబర్ 28న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధరల్లోపెరుగుదల కనిపించడంతో దేశీయంగాను బంగారం ధరలు(Gold and Silver Price) పైకెగశాయి. మరోవైపు భారీగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు మాత్రం ఈరోజు కాస్త ఊరట నిచ్చాయి. ఈరోజు అంటే గురువారం (డిసెంబర్ 28) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్(Hyderabad) లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold and Silver Price) 100 రూపాయలు పెరిగింది. దీంతో రూ.58,500ల వద్ద చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం కూడా 110 రూపాయలు పెరిగి రూ. 63,820ల వద్దకు చేరింది. అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు పెరిగి రూ.58,650ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Today) ధర 110 రూపాయలు పెరిగి రూ.63,970ల వద్దకు చేరుకుంది.
ఇక వెండి ధరలు కూడా ఈరోజు కాస్త తగ్గాయి. ఒకవైపు బంగారం(Gold and Silver Price) ధరలు పై చూపులు చూస్తే, వెండి ధరలు మాత్రం కాస్త ఊరట నిచ్చాయని చెప్పవచ్చు. వెండి ధరలు కేజీకి 300 రూపాయలు తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో వెండి కేజీకి రూ.79,800ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు కేజీకి 300 రూపాయలు తగ్గింది. దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ.79,200లుగా ఉంది.
Also Read: ఆశలు ఆవిరి.. బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి.. ఎంతంటే..
అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు(Gold and Silver Price)ఈరోజు పెరుగుదల కనబరిచాయి. ఔన్సు బంగారం ధర 20 డాలర్ల మేర పెరిగింది. ఈరోజు ఔన్స్ బంగారం(Gold and Silver Price) 2085 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Silver Rate) ఔన్స్ 24.40డాలర్లుగా కొనసాగుతోంది.
గమనిక: బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.
Watch this interesting Video: