Gold and Silver Price : రెండు రోజులపాటు నిలకడగా ఉండి.. బుధవారం పెరుగుదల బాట పట్టిన బంగారం.. అదే దారిలో పయనిస్తోంది. వరుసగా రెండోరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో ఉన్న బంగారం ధరలు ఈ పెరుగుదలతో మరింత పైకి చేరుకున్నాయి. బంగారం ధరల పరుగులు ఎప్పుడు ఆగుతాయో అని బంగారం కొనాలని అనుకునే వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఇప్పట్లో ఆ అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగుతూనే ఉంది. డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. దీంతో దేశీయంగా బంగారం ధరలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి. మధ్యలో కాస్త ఊరట ఇచ్చినట్టు కనిపించినా.. బంగారం ధరల పెరుగుదల మాత్రం ఆగడం లేదు. ఈరోజు అంటే డిసెంబర్ 28న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధరల్లోపెరుగుదల కనిపించడంతో దేశీయంగాను బంగారం ధరలు(Gold and Silver Price) పైకెగశాయి. మరోవైపు భారీగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు మాత్రం ఈరోజు కాస్త ఊరట నిచ్చాయి. ఈరోజు అంటే గురువారం (డిసెంబర్ 28) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Gold and Silver Price : బంగారం మళ్ళీ పైపైకి.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 100 పెరిగి రూ.58,500ల వద్దకు, 24 క్యారెట్ల బంగారం 110 పెరిగి రూ.63,820లకు చేరుకున్నాయి. ఇక వెండి ధర మాత్రం కేజీకి 300 తగ్గి రూ.79,800ల వద్దకు చేరుకుంది.
Translate this News: