Today Gold and Silver Price: బంగారం ధరలు నిలకడగా.. వెండి చౌకగా..  

నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు కొద్దిపాటి తగ్గుదల కనబరిచాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,690, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,760 గా ఉంది. కేజీ వెండి రేటు భారీగా తగ్గి ₹ 90,000 గా ఉంది.  

Today Gold and Silver Price: బంగారం ధరలు నిలకడగా.. వెండి చౌకగా..  
New Update

Today Gold and Silver Price: వరుసగా తగ్గుతూ వస్తున్నాయి బంగారం ధరలు. గత వారం చివరిలో ప్రారంభమైన బంగారం తగ్గుదల కొనసాగుతూనే ఉంది. ఎంతో కొంత తగ్గడం లేదా స్థిరంగా ఉండడం ఇలానే ఉంది బంగారం ధరల పరిస్థితి.  అలాగే  వెండి విషయానికి వస్తే ఇటీవల భారీగా తగ్గుదల నమోదు చేస్తూ వస్తోంది. గత ఎనిమిది రోజులుగా వెండి ధరలు భారీగా తగ్గాయని చెప్పవచ్చు. .దాదాపుగా కేజీకి 4 వేల రూపాయల పైనే వెండి ధరలు తగ్గాయి. మొత్తంగా చూసుకుంటే ఈరోజు అంటే సెప్టెంబర్ 5న బంగారం ధరలు కొద్దిపాటి తగ్గుదల కనబరిచాయి. ఇంచుమించుగా గోల్డ్ రేట్స్ స్థిరంగా నిలిచి బంగారం కొనాలని అనుకునేవారికి ఊరట కలిగించాయని చెప్పవచ్చు.  ఇక ఈరోజు అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు కొద్దిపాటి పెరుగుదలతో ట్రేడ్ అవుతున్నాయి.   ఈ నేపథ్యంలో ఆప్రభావం ఎప్పటిలానే మన మార్కెట్లపై కూడా కనిపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈరోజు మార్కెట్ ముగిసే సరికి బంగారం, వెండి ధరలు (Silver Price) కాస్త పెరుగుదల నమోదు చేసే అవకాశం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Today Gold and Silver Price:  తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కేవలం పదిరూపాయలు తగ్గింది.  అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా తగ్గింది.   ఇక దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోనూ ఈరోజు బంగారం ధరలు ఇదే ధోరణిలో ఉన్నాయి. అక్కడా  22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయాలు తగ్గింది.  మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు భారీగా తగ్గాయి. 

 ఈరోజు హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి 

22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,690

24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 72,760

ఇక విజయవాడ ,  విశాఖపట్నం , తిరుపతి లలోనూ బంగారం ధరలు తగ్గుదల  కనబరిచాయి. ఆ ప్రాంతాల్లో ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి .  

22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,690

24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 72,760

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు దిగొచ్చాయి.  ఈరోజు తగ్గుదల కనబరిచిన బంగారం ధరలు కింది విధంగా ఉన్నాయి. 

 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ₹ 66,840

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 72,910

Today Gold and Silver Price: బంగారం ధరలు కొద్దిగా తగ్గుదల కనబరిస్తే, మరోవైపు వెండి ధరలు కేజీకి 900 రూపాయల మేర భారీగా తగ్గాయి. హైదరాబాద్ లోనూ ,  ఢిల్లీలోనూ కూడా వెండి ధరలు తగ్గుదల నమోదు చేశాయి. 

హైదరాబాద్ లో వెండి ధర కేజీకి.. ₹ 90,000 గానూ ,  ఢిల్లీలో వెండి ధర కేజీకి ₹ 85,000 గానూ ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్నాయి .  

ఇక అంతర్జాతీయంగా బంగారం ధరల్లో కాస్త పెరుగుదల  కనిపిస్తోంది.   ఈరోజు అంటే సెప్టెంబర్ 5 ఉదయం 6 గంటల సమయానికి అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సు 2,495 డాలర్ల వద్ద ఉన్నాయి.  అలాగే వెండి ధరలు బాగా తగ్గి కేజీకి 908 డాలర్లకు దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయి.

#gold-rates #silver-price-in-andhra-pradesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe