Today Gold and Silver Price: వరుసగా తగ్గుతూ వస్తున్నాయి బంగారం ధరలు. గత వారం చివరిలో ప్రారంభమైన బంగారం తగ్గుదల కొనసాగుతూనే ఉంది. ఎంతో కొంత తగ్గడం లేదా స్థిరంగా ఉండడం ఇలానే ఉంది బంగారం ధరల పరిస్థితి. అలాగే వెండి విషయానికి వస్తే ఇటీవల భారీగా తగ్గుదల నమోదు చేస్తూ వస్తోంది. గత ఎనిమిది రోజులుగా వెండి ధరలు భారీగా తగ్గాయని చెప్పవచ్చు. .దాదాపుగా కేజీకి 4 వేల రూపాయల పైనే వెండి ధరలు తగ్గాయి. మొత్తంగా చూసుకుంటే ఈరోజు అంటే సెప్టెంబర్ 5న బంగారం ధరలు కొద్దిపాటి తగ్గుదల కనబరిచాయి. ఇంచుమించుగా గోల్డ్ రేట్స్ స్థిరంగా నిలిచి బంగారం కొనాలని అనుకునేవారికి ఊరట కలిగించాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు కొద్దిపాటి పెరుగుదలతో ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్రభావం ఎప్పటిలానే మన మార్కెట్లపై కూడా కనిపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈరోజు మార్కెట్ ముగిసే సరికి బంగారం, వెండి ధరలు (Silver Price) కాస్త పెరుగుదల నమోదు చేసే అవకాశం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Today Gold and Silver Price: బంగారం ధరలు నిలకడగా.. వెండి చౌకగా..
నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు కొద్దిపాటి తగ్గుదల కనబరిచాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,690, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,760 గా ఉంది. కేజీ వెండి రేటు భారీగా తగ్గి ₹ 90,000 గా ఉంది.
Translate this News: