అబ్దుల్ కలాం...ఆదర్శానికి నిలువెత్తు రూపం. యువతో విజయకాంక్షలను రగిలించిన మిస్సైల్ మ్యాన్. కలాం మరణించి నేటితో 8 ఏళ్లు పూర్తయ్యాయి. యువతకు స్పూర్తిని నింపి కలలంటే నిద్రలో వచ్చేవి కావు. నిద్రపోనివ్వకుండా చేసివి అని ఎంతో మంది యువతలో స్పూర్తినిని నింపిన అబ్దుల్ కలాం వర్థంతి నేడు. కలాం వర్ధంతి సందర్బంగా ఆ మహాత్ముడికి యావత్ దేశం ఘనంగా నివాళులర్పిస్తుంది. కాలం చేసిన సేవలను మరోసారి గుర్తు చేసుకుంటుంది యావత్ భారతం.
కలలు కనడం కాదు...వాటిని సాకారం చేసుకోమంటూ విద్యార్థి లోకాన్ని తట్టిలేపిన గొప్ప మహానీయులు అబ్దుల్ కలాం. శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, అధ్యాపకుడిగా, రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం అందించిన సేవలు అసాధారణమైనవి. చిన్న లక్ష్యమనేది పెద్ద నేరంతో సమానమని అబ్దుల్ కలాం ఎప్పుడూ చెప్పేవారు. పెద్ద లక్ష్యాలను పెట్టుకోని వాటికోసం పోరాడాలని అంటుండేవారు. 1931, అక్టోబర్ 15వ తేదీని తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. కలాం కుటుంబం పేదరికంలో ఉండటంతో చిన్నప్పటి నుంచే తన అవసరాలకు పేపర్ బాయ్ గా పనిచేశారు కలాం. మద్రాస్‌లోని ఐఐటీలో చదువు పూర్తిచేసిన తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సర్వీస్‌లో సభ్యుడిగా చేరి, భారత రక్షణ పరిశోధనలోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో శాస్త్రవేత్తగా చేరారు.1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చాలా కాలంపాటు తన సేవలను అందించారు.
దేశపు మిస్సైల్ మ్యాన్:
జయాలు సాధిస్తూనే, తన సీనియర్లకు ఆయన ఎప్పుడూ ప్రత్యేకమే. బాలిస్టిక్ క్షిపణుల కోసం ప్రాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ వాలియంట్ బాధ్యతలను స్వీకరించారు. కలాం నాయకత్వంలో భారతదేశం అగ్ని, ఆకాష్, నాగ్, పృథ్వీ, త్రిశూల్ వంటి క్షిపణులను అభివృద్ధి చేసింది. డాక్టర్ కలాం జీవితంలో ఈ దశకు ముందే చాలా గౌరవప్రదమైన వ్యక్తిగా నిలిచారు. ఆయన ప్రధానమంత్రికి రక్షణ సలహాదారుగా కూడా ఉన్నారు. ఆ తర్వాత పోఖ్రాన్ 2 అణుపరీక్ష విజయవంతం కావడంలో తనవంతు కృషి చేశారు. పద్మశ్రీ, పద్మవిభూషణ్‌లతో సత్కరించిన డాక్టర్ కలాం 1997లో భారతరత్నతో సత్కరించారు. ఆ తర్వాత 2002లో భారత రాష్ట్రపతి అయ్యారు. అయితే ఇన్ని ఎత్తుల మధ్య కూడా తన సింప్లిసిటీని, వినయాన్ని వదలలేదు.
తన రాష్ట్రపతి పదవీకాలం పూర్తయిన తర్వాత, డాక్టర్ కలాం తనకు ఇష్టమైన పనిని చేయడానికి ఇష్టపడ్డారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, షిల్లాంగ్, ఇండోర్, అహ్మదాబాద్‌లలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఛాన్సలర్, అన్నా యూనివర్శిటీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్, దేశంలోని అనేక పెద్ద సంస్థలలో బోధనా పనిని కొనసాగించారు. కానీ ఈ సమయంలో ఆయన భారత మాజీ రాష్ట్రపతి అని ఎవరూ భావించలేదు. ఎప్పటిలాగే కలాం సరళతచెక్కుచెదరలేదు. ఇంత గొప్ప మహానుభావుడు 83 ఏళ్ళ వయసులో 2015, జులై 27న షిల్లాంగ్ లోని IIMలో ప్రసంగిస్తుండగా గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. దేశానికి అబ్దుల్ కలాం సేవలు ఎప్పటికీ మరవలేనివి. నేడు అబ్దుల్ కలాం 8వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు.