Telangana: నిప్పుల కొలిమిల తెలంగాణ ..ఇప్పటికే వడదెబ్బతో ఇద్దరు మృతి.. మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

తెలంగాణలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్‌ మొదట్లోనే ఇలా మండిపోతుంటే ఇక మే నెలలో ఎలా ఉంటాయో ఆలోచిస్తేనే ఉక్కపోత ఎక్కువ అయిపోతుంది.తొమ్మిది జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

New Update
Telangana: నిప్పుల కొలిమిల తెలంగాణ ..ఇప్పటికే వడదెబ్బతో ఇద్దరు మృతి.. మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

తెలంగాణలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్‌ మొదట్లోనే ఇలా మండిపోతుంటే ఇక మే నెలలో ఎలా ఉంటాయో ఆలోచిస్తేనే ఉక్కపోత ఎక్కువ అయిపోతుంది. ఉదయం 7 తర్వాత ప్రజలు రోడ్లపైకి రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మంగళవారం తొమ్మిది జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాచలం పట్టణంలో 44.7 డిగ్రీల సెల్సియస్‌ నమోదనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

నల్గొండ, జగిత్యాల, తో పాటు అనేక మండలాల్లో 44.5 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. నేడు, రేపు రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతుందని.. పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.ఇక వడదెబ్బ కారణంగా మంగళవారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్‌కు చెందిన చిట్ల రామక్క అనే వృద్దురాలు వడదెబ్బతో మృతి చెందింది. సూర్యాపేట జిల్లా ఫణిగిరికి చెందిన సంగం సుందరయ్య (70) ఖాళీ మద్యం సీసాలు ఏరుకుని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం కూడా సీసాలు ఏరుకుంటూ వడదెబ్బతో అక్కడికక్కడే కుప్పకూలి స్పాట్‌ లనే చనిపోయాడు.

ఈ జాగ్రత్తలు తీసుకోండి.

ఎండత తీవ్రత అత్యధికంగా ఉండడంతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయట తిరగకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే... తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికపాటి లేత రంగు దుస్తులను మాత్రమే ధరించాలి. ఎండాకాలంలో మద్యానికి దూరంగా ఉండటం మంచిది. వడదెబ్బ లక్షణాలు కనిపించగానే చికిత్స అందించాలి.

లేదంటే బీపీ, పల్స్‌ పడిపోయి కొన్నిసార్లు ప్రాణాలు పోవచ్చు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లని వాతావరణంలోకి తీసుకెళ్లాలి. ప్రథమ చికిత్సగా మెడ, ముఖంపై ఐస్‌ ప్యాక్‌ పెట్టాలి. ఒంటిపై దుస్తులను వదులుగా ఉంచి గాలి బాగా ఆడేలా చూసుకోవాలి. నీరు, ద్రవాహారాలను బాగా అందించాలి. వడదెబ్బ లక్షణాలు తీవ్రంగా ఉంటే.. వెంటనే హాస్పటల్‌కు తీసుకువెళ్లడం ఉత్తమం.

Also read: మామిడి పండు తినే అరగంట ముందు ఇలా చేయండి..లేకపోతే చాలా ప్రమాదం!

Advertisment
Advertisment
తాజా కథనాలు