Tobacco Habit in India: భారత ప్రభుత్వం ఇటీవల గృహ వినియోగ వ్యయ సర్వే నివేదికను విడుదల చేసింది. ఈ సర్వేలో, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాలలో వస్తువులు, సర్వీసుల వినియోగం గురించి డేటా సేకరించారు. 2022-23 సంవత్సరపు సర్వే ప్రకారం, గత 10 సంవత్సరాలలో, గ్రామీణ,పట్టణ ప్రాంతాల ప్రజలు తమ ఆదాయంలో అధిక భాగాన్ని పాన్, పొగాకు..ఇతర మత్తు పదార్థాలపై ఖర్చు ఎక్కువగా చేస్తున్నారు. గృహ వినియోగ వ్యయ సర్వే డేటా గ్రామీణ ప్రాంతాల్లో, పాన్, పొగాకు , మత్తుపదార్థాలు అలాగే అటువంటి ఇతర వస్తువులపై 2011-12 సంవత్సరంలో 3.21 శాతంగా ఉంది. ఇది 2022-23 సంవత్సరంలో 3.79 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో వీటిపై 2011-12లో 1.61 శాతం ఖర్చు చేయగా, 2022-23 నాటికి 2.43 శాతానికి పెరిగింది. దీనికి విరుద్ధంగా, పట్టణ ప్రాంతాల్లో విద్యపై ఖర్చు 10 సంవత్సరాల క్రితం 6.90 శాతం నుండి 10 సంవత్సరాల తర్వాత 5.78 శాతానికి తగ్గింది. 2022-23లో గ్రామీణ ప్రాంతాల్లో విద్యపై వ్యయం 3.49 శాతం నుంచి 3.30 శాతానికి తగ్గింది.
2022-23 సంవత్సరానికి సంబంధించిన సర్వే నివేదిక..
గణాంకాలు,కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ జాతీయ నమూనా సర్వే(Tobacco Habit in India) కార్యాలయం ఆగస్టు 2022 నుండి జూలై 2023 వరకు గృహ వినియోగ వ్యయ సర్వేను నిర్వహించింది. ప్రతినెలా కుటుంబం తలసరి వినియోగ వ్యయాన్ని అంచనా వేయడం ఈ సర్వే ప్రధాన లక్ష్యం. ఈ సర్వేలో, 2011-12లో పట్టణ ప్రాంతాల్లో పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారంపై ఖర్చు 8.98 శాతంగా ఉందని, ఇది ఇటీవలి సర్వేలో 10.64 శాతానికి పెరిగిందని తెలిసింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 7.90 శాతం నుంచి 9.62 శాతానికి పెరిగింది. రవాణా విషయానికొస్తే, పట్టణ ప్రాంతాల్లో 6.52 శాతం నుంచి 8.59 శాతానికి, మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో 4.20 శాతం నుంచి 7.55 శాతానికి పెరిగింది.
Also Read: సామాన్యుడికి బస్టాప్ ఉండదు.. కానీ, అంబానీ కోసం.. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్..
MPCE రెండింతలు పెరిగింది
Tobacco Habit in India: ఈ సర్వే ప్రకారం, రెండు ప్రాంతాలలో గరిష్ట తలసరి వినియోగ వ్యయం (MPCE) రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. MPCE అనేది ప్రతి నెలా కుటుంబం తలసరి వ్యయాన్ని కొలుస్తుంది, తద్వారా కుటుంబం ఆర్థిక స్థితిని అంచనా వేస్తుంది. పేదరిక స్థాయిని కొలవడానికి ఈ సంఖ్య చాలా ముఖ్యం. 2011-12 సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో ఎంపీసీఈ రూ.2,630 ఉండగా, ప్రస్తుతం రూ.6,459కి, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,430 నుంచి రూ.3,773కి పెరిగిందని సర్వేలో తెలిపారు.