Winter Health Tips: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. తప్పక పాటించాల్సిన హెల్త్ టిప్స్ ఇవే!

శీతాకాలంలో చలి నుంచి కాపాడుకోవడానికి స్వెట్టర్లు, కాటన్ దుస్తులు ధరించడం సాధారణమే. శీతాకాలంలో బాహ్య శరీరానికి కాపాడుకోవడంలో చూపించిన శ్రద్ధ ఆరోగ్యం విషయంలో చూపించరు. ఈ కాలంలో తాజాపండ్లు, గుడ్లు,డ్రైఫ్రూట్స్, బెల్లం తింటే ఆరోగ్యాంగా ఉంటారు.

New Update
Winter Health Tips: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. తప్పక పాటించాల్సిన హెల్త్ టిప్స్ ఇవే!

శీతాకాలంలో చలి నుంచి కాపాడుకోవడానికి స్వెట్టర్లు, కాటన్ దుస్తులు ధరించడం సాధారణమే. శీతాకాలంలో బాహ్య శరీరానికి కాపాడుకోవడంలో చూపించిన శ్రద్ధ ఆరోగ్యం విషయంలో చూపించరు. చలి నంచి ఉపశమనం కోసం చాలా మంది టీ, కాఫీ ఎక్కువగా తాగుతుంటారు. ఇది ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది? శీతాకాలంలో తీసుకోవల్సిన ఆరోగ్య పరమైన జాగ్రత్తలు ఏంటి. ఎలాంటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఈ విషయాన్నింటిని తెలుసుకుందాం.

స్వీట్లకు బదులు ఇవి తినండి:
చాలామందికి స్వీట్లను తినడం అలవాటు ఉంటుంది. చలికాలంలో ఎక్కువగా తింటుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. స్వీట్లకు బదులుగా తాజా పండ్ల జ్యూసులు, ఖర్జూరం, అత్తి పళ్లు, తేనె లేదా బెల్లం వంటి ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకోవడం మంచిది. చిటికెడు దాల్చినచెక్క, ఏలకులు, కుంకుమపువ్వు లేదా జాజికాయను మీరు తీసుకునే ఆహారం చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

మైదాను తగ్గించండి:
చాలా మంది చలికాలంలో వేడి వేడి స్నాక్స్ తింటుంటారు. అవన్నీ కూడా మైదాతో తయారు చేస్తారు. అయితే మైదా స్థానంలో గోధుమ లేదా మిల్లెట్ పిండిని ఎంపిక చేసుకోండి. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉండటమే కాకుండా అదనపు విటమిన్లు, ఖనిజాలు కూడా మీ శరీరానికి అందుతాయి.

డ్రైఫ్రూట్స్ తినండి:
బాదం, వాల్‌నట్‌లు, పిస్తాపప్పులు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులు వంటివి మీ డైట్లో చేర్చుకోవడం ద్వారా మీ శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.ఈ ప్రోటీన్లు గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.

రంగు రంగుల పండ్లను తినండి:
స్వీట్స్, స్నాక్స్ కు బదులుగా శక్తివంతమైన పండ్లను తినండి. యాపిల్స్, బేరి, దానిమ్మ, నారింజ వంటి తాజా పండ్లు రుచి మొగ్గలను ఆహ్లాదపరచడమే కాకుండా అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి.

ఆరోగ్యకరమైన స్నాక్స్‌:
కాల్చిన చన్నా, వేరుశెనగలు, పండ్లు, లేత కొబ్బరి, కాయలు, చిక్కి, మఖానా, పెరుగు వంటివి తినండి. ఇవి పోషకాలు అధికంగా ఉండే ఎంపిక. ఇవి తింటే రోజంతా శక్తివంతంగా ఉంటారు.

ఎక్కువగా నీళ్లు తాగడం:
చలికాలం అనగానే ఎక్కువ మంది చేసే తప్పులు ఏమిటంటే.. సరిపడన్ని నీళ్లు తాగకుండా ఉండటం. ఎలాగు చలిగా ఉంది కదా ఎక్కువగా నీళ్లు తాగటం అవసరంలేదనుకుంటారు. చాలా మంది. కానీ కాలం ఏదైనా సరే శరీరానికి సరిపడా నీళ్లు తప్పకుండా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

జంక్ ఫుడ్ కు దూరంగా ఉండటం:
చాలా మంది వాతావరణం చల్లగా ఉందంటే చాలు జంక్ ఫుడ్ తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇవి అనేక అనారోగ్య సమస్యలకు కారణంగా అవుతాయని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘ కాలిక సమస్యలకు దారి తీయొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీలైనంతగాజంక్ ఫుడ్​ కు దూరంగా ఉండాలని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: రహదారులు రక్తసిక్తం.. 2 ఘోర ప్రమాదాలు, ఏడుగురి మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు