/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Kodandaram-jpg.webp)
Kodandaram: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఫైర్ అయ్యారు. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దివ్యాంగులు కొన్ని ఉద్యోగాలకు పనికిరారని స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని మండిపడ్డారు. వైకల్యం పేరుతో వారి హక్కులను హరించడం సరైంది కాదని అన్నారు. చట్టాలను అమలు చేయాల్సిన ఐఏఎస్ అధికారిణి వైకల్యాన్ని కించపర్చడం సమంజసం కాదని చెప్పారు. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను ఖండించుకోకపోగా సమర్థించుకోవడం శోచనీయం అని ఫైర్ అయ్యారు. సమాజం ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు.