AP Politics: తిరువూరులో హై టెన్షన్.. ఆందోళకు దిగిన అధికార పార్టీ ఎమ్మెల్యే

ఎన్టీఆర్ జిల్లా కంభంపాడులో అధికార టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివసరావు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఎంపీపీ భర్త అక్రమంగా భవనం నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే ఆ భవాన్ని కూల్చాలని డిమాండ్ చేశారు.

New Update
AP Politics: తిరువూరులో హై టెన్షన్.. ఆందోళకు దిగిన అధికార పార్టీ ఎమ్మెల్యే

Tiruvuru: ఎన్టీఆర్ జిల్లా కంభంపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీపీ భర్త కాలసాని చెన్నారావు నిర్మిస్తున్న భవనం అక్రమం అంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (MLA Kolikapudi Srinivasa Rao) నేరుగా ఆందోళనకు దిగారు. ఆ భవనాన్ని కూల్చివేయాలని ఆయన డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించారు. మరో వైపు ఎంపీపీ అనుచరులు, వైసీపీ (YCP) శ్రేణులు బిల్డింగ్ కూల్చివేయవద్దంటూ భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Also Read: పక్షవాతం.. దశాబ్దం గడుస్తున్న పెన్షన్ కి నోచుకోని అభాగ్యుడు..!

Advertisment
తాజా కథనాలు