Tirumala: శ్రీవారి ప్రత్యేక దర్శనం, లడ్డూ ధరల పెంపు.. TTD కీలక ప్రకటన! తిరుమలలో ప్రత్యేక దర్శనం, లడ్డూ ప్రసాదం ధరలు తగ్గినట్లు ప్రచారమవుతున్న వార్తలను టీటీడీ కమిటీ ఖండించింది. దళారులు, బ్రోకర్ల తప్పుడు ప్రచారం నమొద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ధరల్లో ఎలాంటి మార్పు లేదని, మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. By srinivas 22 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి TTD: తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan), లడ్డూ ధరలు (Laddu Price) తగ్గించినట్లు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలపై టీటీడీ స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, దళారులు, బ్రోకర్ల తప్పుడు ప్రచారం నమొద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన టీటీడీ అధికారులు.. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300, లడ్డూ ప్రసాదం రూ. 50 ధరల్లో ఎలాంటి మార్పు లేదు. శ్రీవారి లడ్డు ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలను టీటీడీ సవరించినట్లు పలు సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తలు అవాస్తవమని భక్తులకు తెలియజేస్తున్నాం. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొరకు దళారులను సంప్రదించొద్దు. ఈ రోజు కొన్ని వాట్సప్ గ్రూపులలో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొంద వచ్చునని, కొంతమంది వారి ఫోన్ నంబర్లతో కూడిన సమాచారం సర్కులేట్ అవుతుంది. వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ (TTD) వెబ్ సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత టికెట్ల కేటాయింపు జరిగింది. NO CHANGE IN Rs. 300(SED)TICKETS AND LADDU RATES- TTD URGES DEVOTEES NOT TO BELIEVE FAKE NEWS ON SOCIAL MEDIA PLATFORMS pic.twitter.com/07akpcBWMw — Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) June 22, 2024 భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టిక్కెట్లను పొందే సౌకర్యం ఉంది. టూరిజం ద్వారా రావాలి అనుకొనే భక్తులు, దళారీల ద్వారా కాకుండా నేరుగా రాష్ట్ర టూరిజం వెబ్ సైట్ ద్వారా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉంది. భక్తులు గమనించగలరు. కొందరు దళారులు సదరు టూరిజం వెబ్ సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసి ఇస్తామని, ఇందుకుగాను ధర ఎక్కువ అవుతుందని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్ లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా ఇలాంటి దళారుల మాట నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నామంటూ క్లారిటీ ఇచ్చారు. Also Read: ఎల్లుండే ఏపీ కేబినెట్ తొలి భేటీ.. మహిళలకు అదిరిపోయే శుభవార్త!? #tirumala #ttd మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి