IRCTC Tirupati Package:శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ ప్యాకేజీతో దర్శనం సులభం

తిరుమల వెళ్లి ఆ ఏడుకొండల వాడిని దర్శించుకోవాలని ఎంతో మంది భక్తులు పరితపిస్తుంటారు. కానీ తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణం, దర్శన టికెట్లు దొరకడం కష్టంగా ఉంటుంది. అందుకే శ్రీవారి దర్శనం సులభతరం చేసేందుకు ఐఆర్‌సీటీసీ కొత్త ప్యాకేజీ తీసుకొచ్చింది.

New Update
IRCTC Tirupati Package:శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ ప్యాకేజీతో దర్శనం సులభం

IRCTC Tirupati Package:
IRCTC కొత్త ప్యాకేజీ..

ఏడుకొండలు ఎక్కి ఆ కోనేటి రాయుడిని దర్శించుకోవాలని భక్తులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. కానీ శ్రీవారి దర్శనం కోసం ట్రైన్ టికెట్లు, దర్శన టికెట్లు దొరక్క అవస్థలు పడుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(IRCTC)సంస్థ కొత్త ప్యాకేజీ తీసుకువచ్చింది. అయితే ఇది కేవలం ఏపీ నుంచి తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు మాత్రమే. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలతో పాటు కాణిపాకం, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి ఆలయాలు కూడా సందర్శించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన స్పెషల్ ట్రైన్ ప్రతి శుక్రవారం విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. విశాఖపట్నం, అన్నవరం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఈ ట్రైన్ ఎక్కొచ్చు. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు ఈ టూర్ ఉంటుంది. ఆగస్ట్ 18, 25, సెప్టెంబర్ 1,8,15,22 తేదీల్లో ప్రయాణాలకు టికెట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి. సెప్టెంబర్ 29 తర్వాత నుంచి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రతి శుక్రవారం ప్రత్యేక రైలు..

మొదటిరోజు విశాఖపట్నంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలు బయలుదేరి.. రెండవ రోజు శనివారం ఉదయం తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. అనంతరం అక్కడ నుంచి హోటల్‌కు తీసుకువెళతారు. ఉదయం అల్పాహారం తర్వాత కాణిపాకం, శ్రీనివాస మంగాపురం తీసుకువెళ్తారు. అక్కడ దర్శనం అనంతరం రాత్రికి హోటల్‌లో బస ఉంటుంది. తర్వాతి రోజు ఉదయం తిరుచానూరు, శ్రీకాళహస్తి తీసుకువెళ్లి దర్శనం చేయిస్తారు. తదుపరి తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఇందుకోసం IRCTC ప్రత్యేక దర్శన టికెట్లు ఏర్పాటు చేస్తుంది. దర్శనం పూర్తయ్యాక రాత్రి 8:30 గంటలకు తిరుపతి స్టేషన్‌లో బయలుదేరి నాలుగో రోజు ఉదయం 11:30 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో యాత్ర పూర్తవుతుంది. టూర్ ప్యాకేజీలో భాగంగా దర్శనం టికెట్లు, ఏసీ రూంలో బస, ఏసీ బస్సు, ఉదయం టిఫిన్, రాత్రి భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి.

సంప్రదాయ దుస్తులే ధరించాలి..

ప్రభుత్వం నియమించిన గైడ్ మీకు సహకరిస్తారు. టోల్, పార్కింగ్ ఛార్జీలు IRCTC చూసుకుంటుంది. అయితే పర్యటక ప్రదేశంలో ఎక్కడైనా రుసుములు ఉంటే అది మాత్రం మీరు చూసుకోవాలి. దర్శనం కోసం స్త్రీ, పురుషులు సంప్రదాయ దుస్తులే ధరించాలి. స్లీపర్ క్లాస్, ఏసీ త్రీ టైర్, టూ టైర్ సదుపాయాలు ఉన్నాయి. రూ.10వేల నుంచి ప్రారంభమయ్యే ప్యాకేజీ ధరల వివరాల కోసం ఐఆర్‌‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com సంప్రదించండి.

Also Read: శ్రావణ మాసంలో శివలింగాన్ని ఏ దిక్కులో పూజించాలో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు