/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-6-7-jpg.webp)
Animal: రణ్‌బీర్‌కపూర్- సందీప్ వంగా కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘యానిమల్’. ఈ సినిమా జోయా క్యారెక్టర్ సక్సెస్ పై త్రిప్తి డిమ్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ పాత్ర విజయవంతం కావడంలో ఎంతో కృషి, మూవీ టీమ్ సపోర్ట్ ఉందని చెప్పింది. రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ నిజంగా ఈ పాత్ర తనకు దక్కడం అదృష్టంగా భావిస్తానంది.
💙💙💙 pic.twitter.com/EM1Wd1f8Pf
— Triptii Dimri (@tripti_dimri23) June 16, 2022
ఇవే పవర్‌ఫుల్ చేశాయి..
‘నా మీద డైరెక్టర్ కు ఉన్న నమ్మకం. నాకు అన్నింటిని ఎదుర్కొనగలిగే సామర్థ్యం. అంతర్గత సమస్యలపై పోరాడే స్వభావం. ఇవన్నీ నా బ్యాక్ స్టోరీలో భాగమే. అందుకే జోయా ఇతర అని పాత్రల కంటే భిన్నంగా ఉంది. అలాగే అమాయకత్వం, బోల్డ్‌నెస్, విపత్కర పరిస్థితులను నిశ్శబ్ధంగా ఛేదించే గుణం లాంటి లక్షణాలు జోయా పాత్రను పవర్‌ఫుల్ చేశాయి. అందుకే యానిమల్ జోయా పాత్రకు చాలా సక్సెస్ అయింది. ప్రేక్షకులంతా తన రోల్‌కు కనెక్ట్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది’ అని చెప్పింది.
Here’s to new beginnings 💕🙏🏻😃
Thank you #DCA@karanjohar @apoorvamehta18 @buntysajdeh @RajeevMasand @DCATalent pic.twitter.com/gDMoLZtQYv— Triptii Dimri (@tripti_dimri23) February 16, 2021