Best Tips Child: పిల్లలను ఫోన్‌ వాడటం మానిపించే చిట్కాలు మీ కోసం

ఎక్కువ సేపు పిల్లలు కదలకుండా టీవీ, ఫోన్ చూస్తే భవిష్యత్తులో ఊబకాయం, కీళ్ల సమస్యలు, మధుమేహం, గుండె జబ్బులు వంటివి వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లలతో సరదాగా నవ్వుతూ, కబుర్లు చెబుతూ, జోకులేస్తూ గడిపితే స్మార్ట్ ఫోన్ వాడకంపై దృష్టి పెట్టరు.

New Update
Best Tips Child: పిల్లలను ఫోన్‌ వాడటం మానిపించే చిట్కాలు మీ కోసం

Best Tips Child:  చేతిలో డబ్బులు లేకుండా పర్వాలేదు కానీ.. ఫోన్‌లో చార్జింగ్ మాత్రం కచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకంటారా..? ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనే చిన్న పరికరం ప్రపంచాన్ని శాసిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ నిత్యవసర వస్తువుగా ఉంది. ఈ ఫోన్‌ని పెద్ద చిన్న అనే తేడా లేకుండా.. దీని వాడకం రోజురోజుకు పెరిగిపోతుంది. ఒక్క సెకన్‌ ఫోన్‌ లేకపోతే ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. ఆట వస్తువులతో పనే లేకుండా, అమ్మానాన్న పక్కన ఉన్నారా లేరా అనే అనేది కూడా చూడకుండా.. వీడియోలు చూస్తూ కాలాన్ని గడిపేస్తారు ఇప్పటి పిల్లలు. అయితే.. పిల్లలు ఇలా ఫోన్‌ వాడటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు అంటున్నారు. ఎక్కువ సేపు పిల్లలు కదలకుండా టీవీ, ఫోన్ చూస్తే భవిష్యత్తులో ఊబకాయం, కీళ్ల సమస్యలు, మధుమేహం, గుండె జబ్బులు వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు వైద్యులు. ఇలాంటి పరిస్థితులను పిల్లల నుంచి దూరం చేయాలంటే ఈ చిన్న చిట్కాలను ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం.

పిల్లలతో ప్రేమగా ఉంటే ఫోన్‌ వాడకం తగ్గుతుంది..

ముందు తల్లిదండ్రులు ఇతర పెద్దలు చేసే పనులు బట్టి పిల్లలు కూడా అదే చేస్తూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు ఫోన్ , టీవీ చూడటం చేస్తుంటారు. అవి చూసి పిల్లలు కూడా అలాగే తయారవుతారు. కాబట్టి వీటిని పక్కనపెట్టి పిల్లలతో ఆడుకోవడం, మాట్లాడటం, కబుర్లు చెబుతూ ఉంటే పిల్లలు కూడా అదే విధంగా కొనసాగిస్తారు. కొంతమంది పిల్లలు అల్లరి చేసి వాళ్ళకి ఏం కావాలో ఏడుపు ద్వారా సాధించుకుంటారు. అలాంటి సమయంలో పిల్లలు ఏడ్చినా, అలిగినా వారికి ఏం కావాలో అడిగి తెలుసుకుని వారితో ప్రేమగా ఉంటే ఫోన్‌ వాడకం తగ్గుతుంది. పిల్లలతో సరదాగా నవ్వుతూ, కబుర్లు చెబుతూ, జోకులేస్తూ గడిపితే స్మార్ట్ ఫోన్ వాడకంపై దృష్టి పెట్టరు. అంతేకాకుండా బుక్ రీడింగ్, వంటకాలు, పుస్తక పఠనం గురించి చెప్పాలి. బొమ్మల పుస్తకాలతో కూడా మొదలుపెట్టిన వారికి స్మార్ట్‌ఫోన్ దృష్టిమళ్లదు.

ఇది కూడా చదవండి: ఇలా చేశారంటే ఉదయం తొందరగా లేవవచ్చు

నేటితరం పిల్లలకు టెక్నాలజీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగానే వారికే తెలుస్తున్నాయి. బాల్యం నుంచే పిల్లలు చుట్టుపక్కల చిన్నారులతో ఆటలు ఆడటం అలవాటు ప్లాన్ చేయాలి. ఒకవేళ వారి వయసు పిల్లలు లేకపోతే వీలైతే వారితో కాసేపు మీరే కాసేపు గడపండి. పిల్లలతో ఔట్​డోర్ ఆటలు, క్యారమ్స్, చెస్ వంటివి ఆడటం అలవాటు చేస్తే వారు ఫోన్ జోలికి వెళ్లరు. రోజు రోజుకీ పిల్లలు విజ్ఞానవంతులు అవుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు