Tongue Tips: మనం వేడిగా ఉండే ఆహారం తింటే చాలా సార్లు నాలుక కాలిపోతుంది. అంతేకాకుండా చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. దీనివల్ల ఏ ఆహారం తీసుకున్నా రుచి కూడా తెలియదు. సులభమైన ఇంటి చిట్కాలతో ఈ సమస్యను అధిగమించవచ్చు. వేడి ఆహారాన్ని తినడం చాలా మంది ఇష్టపడతారు. కానీ కొన్నిసార్లు నాలుక కాలిపోతుంది. ఆ మంట ఒకటి లేదా రెండు రోజుల్లో దానంతటదే నయమవుతుంది, కాకపోతే బాగా ఇబ్బందిగా ఉంటే ఈ చిట్కాలను పాటించండి.
1. పెరుగు
నాలుక మండితే పెరుగు తింటే చల్లదనంతో పాటు ఉపశమనం కలుగుతుంది. నాలుక కాలినప్పుడల్లా ఒక చెంచా పెరుగుని తీసుకుని కాసేపు నోటిలో పెట్టుకోండి.
2. బేకింగ్ సోడా
- చిటికెడు బేకింగ్ సోడా అనేక సమస్యలకు నివారిణిగా చెప్పవచ్చు. ఇందులోని ఆల్కలీన్ స్వభావం నాలుక మంటను తగ్గిస్తుంది. బేకింగ్ సోడాను నీటిలో కరిగించి దానితో నోటిని శుభ్రం చేసుకుంటే మంట తగ్గుతుంది.
3. చక్కెర
- నాలుక మంట నుండి తక్షణ ఉపశమనం అందించడంలో చిటికెడు చక్కెర కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నోట్లో చక్కెర వేసుకుని కరిగేంత వరకు ఉంచితే చాలు. నీళ్లు కూడా తాగాల్సిన అవసరం లేదు. మంట తొందరగా తగ్గిపోతుంది.
4. తేనె
- తేనెను నాకడం వల్ల నాలుక మంట నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
5. అలోవెరా జెల్
- కలబందను ఉపయోగించడం వల్ల నాలుక మంట నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. దీనిలోని జెల్ శీతలీకరణ స్వభావం కలిగి ఉంటుంది. కలబంద జెల్‌ను ఐస్‌క్యూబ్‌లా చేసుకుని నాలుకపై రుద్దు కోవచ్చు. దీంతో వెంటనే మంట తగ్గిపోతుంది
6. సాధారణ ఆహారాన్ని తినండి
- నాలుక మంటగా ఉంటే వీలైనంత వరకు మామూలు ఆహారం తినాలి, కారంగా ఉండే పదార్థాలను తీసుకోకపోవడం ఉత్తమం.
7. ఐస్ క్యూబ్
- కాలిన నాలుక నుండి ఉపశమనం పొందడానికి ఐస్ క్యూబ్స్ కూడా బెస్ట్ సొల్యూషన్. ఐస్‌క్యూబ్స్‌ని తీసుకుని నీటిలో ముంచి నాలుకపై రుద్దితే మంట పోతుంది.
ఇది కూడా చదవండి: ల్యాప్‌టాప్‌లో ఎక్కువ సేపు పనిచేస్తే ట్రిగ్గర్ ఫింగర్ వ్యాధి వస్తుందా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.