Tongue Tips: నాలుక మంటను వెంటనే తగ్గించే చిట్కాలు

మనం వేడిగా ఉండే ఆహారం తింటే చాలా సార్లు నాలుక కాలిపోతుంది. పెరుగు ,బేకింగ్ సోడా, చక్కెర, అలోవెరా జెల్, తేనె, సాధారణ ఆహారాన్ని తినండి, ఐస్‌క్యూబ్స్‌ని తీసుకుని నీటిలో ముంచి నాలుకపై రుద్దితే మంట పోతుంది.

New Update
Tongue Tips: నాలుక మంటను వెంటనే తగ్గించే చిట్కాలు

Tongue Tips: మనం వేడిగా ఉండే ఆహారం తింటే చాలా సార్లు నాలుక కాలిపోతుంది. అంతేకాకుండా చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. దీనివల్ల ఏ ఆహారం తీసుకున్నా రుచి కూడా తెలియదు. సులభమైన ఇంటి చిట్కాలతో ఈ సమస్యను అధిగమించవచ్చు. వేడి ఆహారాన్ని తినడం చాలా మంది ఇష్టపడతారు. కానీ కొన్నిసార్లు నాలుక కాలిపోతుంది. ఆ మంట ఒకటి లేదా రెండు రోజుల్లో దానంతటదే నయమవుతుంది, కాకపోతే బాగా ఇబ్బందిగా ఉంటే ఈ చిట్కాలను పాటించండి.

1. పెరుగు 

నాలుక మండితే పెరుగు తింటే చల్లదనంతో పాటు ఉపశమనం కలుగుతుంది. నాలుక కాలినప్పుడల్లా ఒక చెంచా పెరుగుని తీసుకుని కాసేపు నోటిలో పెట్టుకోండి.

2. బేకింగ్ సోడా

  • చిటికెడు బేకింగ్ సోడా అనేక సమస్యలకు నివారిణిగా చెప్పవచ్చు. ఇందులోని ఆల్కలీన్ స్వభావం నాలుక మంటను తగ్గిస్తుంది. బేకింగ్ సోడాను నీటిలో కరిగించి దానితో నోటిని శుభ్రం చేసుకుంటే మంట తగ్గుతుంది.

3. చక్కెర

  • నాలుక మంట నుండి తక్షణ ఉపశమనం అందించడంలో చిటికెడు చక్కెర కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నోట్లో చక్కెర వేసుకుని కరిగేంత వరకు ఉంచితే చాలు. నీళ్లు కూడా తాగాల్సిన అవసరం లేదు. మంట తొందరగా తగ్గిపోతుంది.

4. తేనె

  • తేనెను నాకడం వల్ల నాలుక మంట నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.

5. అలోవెరా జెల్

  • కలబందను ఉపయోగించడం వల్ల నాలుక మంట నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. దీనిలోని జెల్ శీతలీకరణ స్వభావం కలిగి ఉంటుంది. కలబంద జెల్‌ను ఐస్‌క్యూబ్‌లా చేసుకుని నాలుకపై రుద్దు కోవచ్చు. దీంతో వెంటనే మంట తగ్గిపోతుంది

6. సాధారణ ఆహారాన్ని తినండి

  • నాలుక మంటగా ఉంటే వీలైనంత వరకు మామూలు ఆహారం తినాలి, కారంగా ఉండే పదార్థాలను తీసుకోకపోవడం ఉత్తమం.

7. ఐస్ క్యూబ్

  • కాలిన నాలుక నుండి ఉపశమనం పొందడానికి ఐస్ క్యూబ్స్ కూడా బెస్ట్‌ సొల్యూషన్‌. ఐస్‌క్యూబ్స్‌ని తీసుకుని నీటిలో ముంచి నాలుకపై రుద్దితే మంట పోతుంది.

ఇది కూడా చదవండి: ల్యాప్‌టాప్‌లో ఎక్కువ సేపు పనిచేస్తే ట్రిగ్గర్‌ ఫింగర్‌ వ్యాధి వస్తుందా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు