Timur Tree Benefits : తైమూర్ మొక్క(Timur Tree) ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయి. దీనిని పహారీ వేప అని పిలుస్తారు. అనేక ఔషధ గుణాలను కలిగి ఉండటం వలన.. ఇది అనేక రకాల చిన్న, పెద్ద వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ఇది దంతాలను బలోపేతం చేయడానికి, రక్తపోటు,చక్కెర వ్యాధుల చికిత్సకు ఔషధంగా పని చేస్తుంది. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ పర్వతాలలో కనిపించే తైమూర్ మొక్కను వృక్షశాస్త్రంలో క్శాంథాక్సిలమ్ అర్మాటం అని కూడా పిలుస్తారు. తైమూర్ మొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువ. ఇంటి ప్రవేశద్వారం దగ్గర ఈ మొక్కను పెట్టుకుంటే..ఇల్లు ప్రతికూల శక్తులచే ప్రభావితం చేస్తుంది. అంటే..ఇల్లు చెడు కళ్ళతో బాధపడదని కొందరూ నమ్ముతారు. ఇది కాకుండా..సనాతన ధర్మంలో..యజ్ఞోపవిత్ సంస్కార్ సమయంలో ఈ తైమూర్ కర్ర బతుక్ చేతిలో ఇవ్వబడుతుంది. తైమూర్‌లో అన్ని గుణాలు ఉన్నాయని, దాని కలప చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుందని నమ్ముతారు. హిమాలయ ప్రాంతాలలో నివసించే ఋషులు, సాధువులు కూడా ఎల్లప్పుడూ తైమూర్ కలపను తమతో ఉంచుకుంటారు. ఈ మొక్క గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
అధిక రక్తపోటు చెక్
- తైమూర్ మొక్కను పహారీ వేప అని కూడా అంటారు. దీని పండ్లు, కొమ్మలు, ఆకులు, గింజలు, బెరడు అన్నీ ఔషధపరంగా చాలా ముఖ్యమైనవి. అంతేకాకుండా ..దీని బెరడును టూత్ పేస్టుగా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే పొటాషియం వల్ల శరీరంలోని అధిక రక్తపోటు(Blood Pressure) ను తగ్గిస్తుంది.
మసాలాగా ..
- కొందరూ తైమూర్‌ను మసాలాగా కూడా ఉపయోగిస్తారట. అంతే కాకుండా.. దాని గింజలు పిప్పరమెంటు వలె పని చేస్తాయి. ఇది దంతాలు, చిగుళ్ళను బలపరుస్తుంది. తైమూర్ మొక్క ఆకులు క్రిమినాశక మందుగా పనిచేస్తాయి. అంతే కాకుండా దీని గింజలు జలుబు, మలబద్ధకం, విరేచనాలు, చర్మ వ్యాధులతో పాటు మౌత్ ఫ్రెషనర్‌గా కూడా పనిచేస్తాయి. తైమూర్ జీర్ణక్రియకు కూడా చాలా సహాయపడుతుంది. ఈ మొక్క యొక్క కొమ్మలలో ముళ్ళు కనిపిస్తాయి. ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలలో కనిపించే తైమూర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: విషపూరితమైన గాలి పోవాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెట్టాల్సిందే!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.