Sasikala: 'నా సమయం ఆసన్నమైంది'.. శశికల పొలిటికల్ రీఎంట్రీ

తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికల సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే (AIDMK) పనైపోయిందని ఎవరూ భావించవద్దని.. పార్టీలో తన ప్రవేశం ప్రారంభమైందని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని ధీమావ్యక్తం చేశారు.

Sasikala: 'నా సమయం ఆసన్నమైంది'.. శశికల పొలిటికల్ రీఎంట్రీ
New Update

Sasikala Declares Her Comeback To Politics: తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత (Jayalalithaa) సన్నిహితురాలు వీకే శశికల మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తాజాగా ఆమె పార్టీ కార్యకలతో సమావేశమయ్యారు. అన్నాడీఎంకే (AIADMK) పనైపోయిందని ఎవరూ భావించవద్దని.. పార్టీలో తన ప్రవేశం ప్రారంభమైందని అన్నారు. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి 'అమ్మ పాలన'ను తీసుకొస్తామని పేర్కొన్నారు. విపక్ష నాయకుడి హోదాలో ఉన్న ఎడప్పాడి కె.పళనిస్వామి (Edappadi K. Palaniswami) అధికార ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారని.. ఇకనుంచి తానే ప్రశ్నిస్తానని చెప్పారు. పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాని ఎవరూ నిరాశ పడాల్సిన అవసరం లేదని సూచించారు. తమిళ ప్రజలు మనతోనే ఉన్నారని.. పార్టీలో తిరిగి ప్రవేశించేందుకు సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు.

Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం షాక్

త్వరలోనే రాష్ట్రపర్యటన చేసి అధికార డీఎంకే పాలనను ఎదుర్కొంటానని తెలిపారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఏఐడీఎంకే మూడు, నాలుగు స్థానాలకు పడిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రాలేకపోయాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చి.. అధికారాన్ని సొంతం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణానంతరం జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే వరుసగా ఓడిపోతూ వస్తోంది. పార్టీలో నేతల మధ్య జరుగుతున్న వర్గపోరు వల్లే పార్టీ పరిస్థితి దిగజారిపోయిందని కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పన్నీర్ సెల్వం, పళనిస్వామి ద్వంద్వ నాయకత్వాన్ని మార్చాలనే డిమాండ్ పెరిగిపోయింది. వీరికి ప్రత్యామ్నాయంగా శశికళ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. వాస్తవానికి జయలలిత చనిపోయాక శశికల పార్టీకి దూరమయ్యారు. సమీప బంధువు టీటీవీ దినకరణ్‌తో స్థాపించిన 'అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం'(AMMK ) అనే పార్టీలో చేరారు. ఏఎంఎంకేను ఏఐడీఎంకేలో విలీనం చేసి.. శశికల తిరిగి పార్టీలో వస్తేగాని విజయం కలిసిరాదని కార్యకర్తలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తాజాగా కార్యకర్తలతో సమావేశమైన శశికళ.. తన రాజకీయ ప్రవేశం ప్రారంభమైందని చెప్పడం కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతోంది.

Also Read: నీట్ గందరగోళం మధ్య విద్యార్థుల్లో పెరుగుతున్న స్ట్రెస్.. ఎలా తగ్గించుకోవాలంటే.

1954 ఆగస్టు 18న తిరువారుర్ జిల్లాలో శశికళ జన్మించారు. ఆమె భర్త ఎం.నటరాజన్.. పబ్లిక్ రిలేషన్ అధికారిగా పనిచేసేవాడు. జయలలితకు అత్యంత నమ్మకమైన వ్యక్తి శశికళ. 1991లో జయలలిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో.. జనాల్లో శశికళ ప్రభావం కూడా పెరిగిపోయింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో శశికళను పార్టీ నుంచి బహిష్కరించే పరిస్థితి కూడా వచ్చింది. అలాగే జయలలిత మరణానంతరం ఆదాయనికి మించిన ఆస్తుల కేసులో శశికళ 2017లో అరెస్టయ్యారు. ఆ తర్వాత 2021లో విడుదలయ్యారు. అప్పటికే ఆమె ఏఎంఎంకే పార్టీలో ఉన్నారు. మరోవైపు ఏఐడీఎంకే కూడా జయలలిత మరణాంతరం వరుసగా ఓటములు ఎదుర్కొంటోంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఘోర పరాజయం పొందింది. ఇలాంటి తరుణంలో శశికళ.. తన సమయం ఆసన్నమైందని.. ఏఐడీఎంకేను అధికారంలోకి తీసుకొస్తానని చెప్పడం తమిళనాడులో చర్చనీయాంశమవుతోంది

#telugu-news #tamilnadu #sasikala
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe