Tiger Nageswara Rao: హీరో రవితేజ(ravi teja) నటించిన 'టైగర్ నాగేశ్వరావు' సినిమాను వివాదాలు వీడడం లేదు. సినిమాను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్టువర్టుపురం గ్రామస్తులు. తమ జాతిని, తమ గ్రామాన్ని కించపరిచే విధంగా టైగర్ నాగేశ్వరావు సినిమాను నిర్మిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.
ఎరుకల జాతి కమ్యూనిటీకి చెందిన టైగర్ నాగేశ్వరావును గజదొంగలాగా చూపించడంతోపాటు, స్టువర్టుపురం ఉన్న అందరూ దొంగలు అనే విధంగా సినిమా తీశారంటున్నారు గ్రామస్తులు. సినిమాను ఆపాలని ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు స్టువర్టుపురం గ్రామస్తులు.
Also Read: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’కి ‘మెగా’ రివ్యూ.. బొమ్మ అదుర్స్ అంటూ ట్వీట్..
ఉద్యమిస్తాం:
సినిమాని ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్టువర్ట్ పురం గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. స్టువర్టుపురం(stuart puram) గ్రామాన్ని దక్షిణ భారతదేశం నేర రాజధానిగా చూపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మీరు తీస్తున్న సినిమాల కారణంగా తమ గ్రామంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు గ్రామస్తులు. సినిమా నిర్మాతలు కానీ దర్శకులు కానీ తమని సంప్రదించలేదంటున్నారు. ఇక నిర్మాణ సంస్థ సామాజిక బాధ్యత లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేట్ పొందకుండా టీజర్ (teaser) విడుదల చేయడంపై ఇటివలే హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సినీ నిర్మాత అభిషేక్ అగర్వాల్(Abhishek agarwal) కు న్యాయపరమైన నోటీసులు ఇచ్చింది.
కోర్టులో బంతి:
టైగర్ నాగేశ్వరరావు సినిమా 'ఎరుకుల' వర్గాల మనోభావాలను కించపరచడమే కాకుండా స్టువర్టుపురం గ్రామస్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని పేర్కొంటూ పిటిషనర్ చుక్కా పాల్‌రాజ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై స్పందిస్తూ, ఈ కేసులో ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్‌పర్సన్‌ను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ను ఆదేశించింది. జస్టిస్ ధనార్జనే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. సినిమాల నిర్మాణం ఒక వర్గం లక్ష్యం కాకూడదని, సమాజం పట్ల బాధ్యతాయుత భావాన్ని కూడా కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఈ దృక్కోణం ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంతో పాటు సామాజిక నిబంధనలను ప్రభావితం చేస్తుందన్నారు. కళ, మీడియా విస్తృత సామాజిక పాత్రను ప్రతిబింబిస్తాయన్నారు. వంశీ కృష్ణ నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ , అనుపమ్ ఖేర్, జాన్ అబ్రహం, జిషు సేన్‌గుప్తా, రేణు దేశాయ్, భాను ప్రకాష్, నూపూర్ సనన్ మరియు గాయత్రీ భరద్వాజ్ లాంటి స్టార్-స్టడెడ్ తారాగణం ఉంది. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీ: మధి, ప్రొడక్షన్ డిజైన్: కొల్లా అవినాష్.
ALSO READ: ‘బలగం’ సినిమా నటుడు మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డైరెక్టర్ వేణు..