/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/chiru-jpg.webp)
Megastar Chiranjeevi reviews Miss Shetty Mr Polishetty: నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty),అనుష్క శెట్టి(Anushka Shetty) కాంబినేషన్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’(Miss Shetty Mr Polishetty). ఈ సినిమాకు మెగాస్టార్ ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఆద్యంతం తనను ఆకట్టుకుందని, ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని చిరంజీవి అన్నారు.
కుదిరితే సినిమా చూస్తా..
"మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చూశాను.. ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే.. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకుంది. హిలేరియస్ ఎంటర్ టైనర్ ఇది. నేటి యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబింపజేస్తూ, సరికొత్త కథతో సినిమా వచ్చింది. జాతి రత్నాలుకి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని నవీన్ పోలిశెట్టి అందించాడు. ఇక కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్ గా అనూష్క ఉంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా సినిమా తీశాడు దర్శకుడు మహేశ్ బాబు." ఇలా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను అభినందించారు మెగాసార్ట్ చిరంజీవి. ఈ సినిమా ఆడియన్స్ కు వంద శాతం నవ్వులు పంచుతుందని, తనది గ్యారెంటీ అని అంటున్నారు. కుదిరితే ఈ సినిమాను ప్రేక్షకుల మధ్య కూర్చొని మరోసారి చూస్తానని కూడా అన్నారు మెగాస్టార్.
Also Read: వంద కుటుంబాలకు కోటి రూపాయలిస్తాను: విజయ్ దేవరకొండ!
'మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి' చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్‌టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, 'జాతి రత్నాలు' కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్… pic.twitter.com/ADJVt6ins6
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 5, 2023
యూవీ క్రియేషన్స్ (UV Creations)కు మెగా హీరోలతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూవీ బ్యానర్ పై త్వరలోనే సినిమా చేయబోతున్నారు చిరంజీవి. ఇక రామ్ చరణ్ అయితే, యూవీ క్రియేషన్స్ నిర్మాతలతో కలిసి ఏకంగా ఓ ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసి, కొత్త సినిమా కూడా ఎనౌన్స్ చేశారు.
Also Read: ఖుషి అయిపోయింది..