Kurnool : టీడీపీలో టికెట్ ఫైట్.. జయనాగేశ్వర్‌రెడ్డి VS మాచాని సోమనాథ్‌..!

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీలో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి, చేనేత సామాజిక వర్గం నేత మచాని సోమనాథ్ మధ్య టికెట్ ఫైట్ నడుస్తోంది. మాజీ ఎంపీ బుట్టా రేణుకను వైసీపీ బరిలోకి దింపడంతో టీడీపీ వ్యూహం మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Kurnool : టీడీపీలో టికెట్ ఫైట్.. జయనాగేశ్వర్‌రెడ్డి VS మాచాని సోమనాథ్‌..!

Also Read : లండన్‌లో కూతురుతో విరాట్ కోహ్లీ…వైరల్ అవుతున్న ఫోటో

తాజాగా, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు(Yemmiganur) టీడీపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి(Jayanageshwar Reddy), చేనేత సామాజికవర్గం నేత , బుట్టా రేణుక అల్లుడు మాచాని సోమనాథ్(Machani Somnath) మధ్య టికెట్ ఫైట్ నడుస్తోంది. ఇద్దరూ సీటు విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ను కలవనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి చంద్రబాబును కలవనుండగా.. రెండ్రోజుల్లో మాచాని సోమనాథ్‌ చంద్రబాబు దగ్గరకు వెళ్లనున్నట్లు సమాచారం.

Also Read: ఆడుదాం ఆంధ్ర అంటూ వైసీపీ ప్రభుత్వం ఇలా చేస్తోంది : షర్మిల

ఇదిలా ఉండగా.. నియోజకవర్గంలో బీసీ నినాదం ఊపందుకున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకను బరిలోకి దింపిన నేపథ్యంలో టీడీపీ వ్యూహం మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మిగనూరు టికెట్ కోసం మాచాని సోమనాథ్ స్పీడ్ పెంచడంతో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అయోమయంలో పడ్డారు.

Advertisment
తాజా కథనాలు