TG Rains: తెలంగాణలో రానున్న 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

TG: రాష్ట్రంలో రానున్న 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్‌, కొమురం భీం అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

New Update
Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..!

Rain Alert To Telangana: తెలంగాణలో రానున్న 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ (IMD Hyderabad) తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రేపు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్‌, కొమురం భీం అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: పోచారం ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు

Advertisment
తాజా కథనాలు