Fake Ed : కాల్ లిఫ్ట్ చేస్తే 8 కోట్లు ఫసక్.. ఈ క్రైమ్ గురించి తెలుసుకుంటే షాకవుతారు !

రాజస్థాన్ జుంజునులో ఫేక్ ఈడీ పేరిట భారీ మోసం జరిగింది. మనీలాండరింగ్ కేసులో తన పేరుందని బెదిరించి ఓ మహిళ నుంచి ఏకంగా రూ.8కోట్లు దోచేశారు దుండగులు. ఆమె ఫిర్యాదుతో కంగుతిన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

New Update
Fake Ed : కాల్ లిఫ్ట్ చేస్తే 8 కోట్లు ఫసక్.. ఈ క్రైమ్ గురించి తెలుసుకుంటే షాకవుతారు !

Jhunjhunu : రాజాస్థాన్(Rajasthan) జుంజునులో భారీ మోసం జరిగింది. స్థానికంగా ఓ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న 57 ఏళ్ల మహిళకు ఫేక్ ఈడీ(Fake ED), ముంబై క్రైమ్ బ్రాంచ్(Mumbai Crime Branch) పేరుతో కాల్స్ చేసి దుండగులు మూడు నెలల్లో రూ.7 కోట్ల 67 లక్షలు దోచేశారు. మహిళ ఆధార్ కార్డు(Aadhaar Card) నుంచి మరో నంబర్ యాక్టివ్‌గా ఉందని నమ్మించి ఆమెను భయాందోళనకు గురిచేయడంతో ఈ దారుణం జరిగిందని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

మనీలాండరింగ్‌ కేసు..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2023 అక్టోబర్‌లో తనకు అపరిచితులనుంచి కాల్ వచ్చిందని మహిళ ఫిర్యాదు చేసింది. మనీలాండరింగ్‌ కేసు వ్యవహారంలో తన పేరుందని చెప్పడంతో.. భయపడిన మహిళ డబ్బులు డిపాజిట్ మొదలు పెట్టింది. అరెస్టు చేస్తారని భయపడిపోయిన ఆమె బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని మరి రూ.80 లక్షలు దుండగులకు ముట్టచెప్పింది. మొత్తం 42 లావాదేవీలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి : Yashaswi Jaiswal: కుర్రాడు కుమ్మేశాడు.. వరుస టెస్టుల్లో రికార్డు డబుల్ సెంచరీ

వివిధ మార్గాల్లో బెదిరించి..
ఇదే క్రమంలో ఆ మహిళకు ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ పేరుతో మరో కాల్ వచ్చింది. ముంబై పోలీస్ ఎస్‌ఐ అని చెప్పుకుంటున్న వ్యక్తి స్కైప్(Skype) ద్వారా ఆన్‌లైన్ మీటింగ్ జాయిన్ కావాలని అడిగినట్లు వివరించింది. ఓ ఇష్యూకు సబంధించి మనీలాండరింగ్‌ కేసులో రూ.20 లక్షల లావాదేవీల్లో తన పేరు రావడంతో మరిన్ని సమస్యలు పెరిగాయి. ఇదే అదనుగా దుంగులు ఈ ఇష్యూ ఈడీకి చేరిందని చెబుతూ అక్టోబర్ 2023 నుంచి 2024 జనవరి 31 వరకు వివిధ మార్గాల్లో బెదిరించి దుండగులు రూ.7 కోట్ల 67 లక్షలను రాబట్టుకున్నారు

తిరిగి ఇవ్వలేదు..
అయితే దీనిపై అనుమానం వచ్చి తన డబ్బును తిరిగి ఇవ్వాలని ఆమె మోసగాళ్లను అడిగింది. దీంతో 2024 ఫిబ్రవరి 12, 2024 వరకూ చెల్లిస్తామన్నారు. కానీ తిరిగి ఇవ్వలేదు. ఫిబ్రవరి 15 వరకు నిందితుడి నుంచి ఎలాంటి పరిచయం లేకపోవడంతో భయంతో తన స్నేహితులకు బాధను వివరింగా వాళ్ల సహాయంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సైబర్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ డీఎస్పీ హరిరామ్ సోనీ(Hari Ram Sony) తెలిపారు. ఈ కేసులో ముంబై వాసులు సందీప్‌రావు, ఆకాష్‌ కుల్హారీతో పాటు మరొకరిపై పేరున రిపోర్టు దాఖలైంది. కేసు పెట్టిన తర్వాత ఆ మహిళ సిగ్గు, భయంతో ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఎవరి ముందుకు రావడం లేదని అధికారులు తెలిపారు.

Also Read : వారికి వడ్డీ లేని రుణాలు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

Advertisment
Advertisment
తాజా కథనాలు