Karimnagar : కలుషిత మాంసం తిని ముగ్గురు మృతి.. 12మంది పరిస్థితి విషమం

కలుషిత మాంసం తిని ముగ్గురు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గౌరెడ్డిపేటలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున ఒడిశా కూలీలు రాత్రి వండుకున్న మాంసం ఉదయం తినడంతో వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారు.

New Update
Karimnagar : కలుషిత మాంసం తిని ముగ్గురు మృతి.. 12మంది పరిస్థితి విషమం

Peddapalli : కలుషిత మాంసం(Contaminated Meat) రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. పొట్టకూటి కోసం పిల్లపాపలతో కలిసి వసల వచ్చిన కూలీల కుటుంబంలో తీరని విషాదం నింపింది. మొత్తం ముగ్గురు వ్యక్తులు మరణించగా 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. అస్వస్థకు గురైన వారిలో ముగ్గురు పిల్లలుండటం కలవరపెడుతుంది. ఈ ఘనట ఉమ్మడి కరీంగనర్(Karimnagar) జిల్లా పెద్దపల్లిలో చోటుచేసుకుంది.

ఇటుక బట్టీల్లో ఒడిశా కూలీలు..
ఈ మేరకు పోలీసులు, వైద్యులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటలోని ఎంఎస్‌ఆర్‌, ఎస్‌వీసీ ఇటుక బట్టీల్లో ఒడిశా(Odisha) రాష్ట్రానికి చెందిన కూలీలు పని చేస్తున్నారు. అయితే వీరంతా గురువారం పెద్దపల్లిలో జరిగే వారంతపు సంతకు వెళ్లి కోడి తెచ్చుకుని వండుకు తిన్నారు. మరుసటి రోజు కూడా అదే తినడంతో వాంతులు(Vomiting), విరేచనాల(Motions) తో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అస్వస్థకు గురైన వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో నలుగురిని ఏఎంసీ ఆస్పత్రిలో చేర్పించారు. ఇందలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి : ICC U19: నేడే తుది సమరం.. కంగారులను కంగారెత్తిస్తున్న భారత్ రికార్డ్!

12 మందికి విషమం..
అయితే అదే రోజు చికిత్స పొందుతూ బలంగీర్‌ జిల్లాకు చెందిన చంద్రశేఖర్‌ బరియా(54), శనివారం నౌపాలా జిల్లాకు చెందిన లలిత(26)లు చనిపోయారు. చంద్రశేఖర్‌ది సహజ మరణంగా భావించిన వైద్యులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మరో కూలీ కూడా మృతిచెందడంతో పోలీసులకు సమాచారం అందించారు. వైద్యులు మిగతా కూలీల పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పడంతో 12 మందిని కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, నలుగురిని పెద్దపల్లి ఆసుపత్రికి, ఇంద్రావతి అనే మహిళను హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించినట్లు పెద్దపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్‌ వివరించారు.

కోడి పేగులు, కాళ్లు..
ఈ ఘటన గురించి తెలియగానే, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. అక్కడ సూపర్ వైజర్ గా పని చేస్తున్న మల్లేశంను విచారించగా వారు కోడి పేగులు, కాళ్లు తిన్నారని, ఆ తర్వాత అస్వస్థకు గురైనట్లు వివరించాడని ఏసీపీ ఎడ్ల మహేశ్‌ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Also Read : Migraine: ఈ ఆహారాలతో మైగ్రేన్ నొప్పికి చెక్ పెట్టండి

Advertisment
తాజా కథనాలు