Major Accident: కారును ఢీకొట్టిన ఆర్మీ బస్సు..ముగ్గురు మృతి..26మంది జవాన్లకు గాయాలు..!

మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జవాన్లతో వెళ్తున్న బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. 26మంది సైనికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒక సైనికుడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

New Update
Major Accident: కారును ఢీకొట్టిన ఆర్మీ బస్సు..ముగ్గురు మృతి..26మంది జవాన్లకు గాయాలు..!

Major Accident: మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (ఎస్ఏఎఫ్) సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మరణించగా, 26 మంది సైనికులు గాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడని, ఆయన పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియోని-మండ్లా రాష్ట్ర రహదారిపై ధంగధ గ్రామం సమీపంలో శుక్రవారం రాత్రి 1 గంటకు ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర పోలీసు 35వ సాఫ్ బెటాలియన్‌కు చెందిన సైనికులతో మాండ్లా నుండి పంధుర్నా (చింద్వారా)కి వెళ్తున్న బస్సు కారును ఢీకొట్టిందని కియోలారి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ చైన్ సింగ్ ఉయికే తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కన్హయ్య జస్వానీ (75), నిక్లేష్ జస్వానీ (45), డ్రైవర్ పురుషోత్తం మహోబియా (37) మృతి చెందారు. మృతులు మండల వాసులని ఆయన తెలిపారు.


ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు కారు ప్రయాణికులు కియోలారి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కియోలారి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ చైన్ సింగ్ ఉయికే తెలిపారు.కారులో ఉన్నవారంతా నాగ్ పూర్ లోని ఓ ఆసుపత్రికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కారును ఢికొన్న తర్వాత SAF సైనికులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడిందని ఆయన చెప్పారు. మొత్తం 26 మంది SAF సైనికులు గాయపడ్డారని, వారిని కేవలరి ఆసుపత్రికి తరలించామని ఆయన చెప్పారు. వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని, వారిని నాగ్‌పూర్‌కు తరలించామని, ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.

ఇది కూడా చదవండి: డ్యాన్స్ తో అదరగొట్టిన సీఎం..కార్యకర్తల్లో ఫుల్ జోష్..!

Advertisment
తాజా కథనాలు