ముంబై(Mumbai)లో ఓ కారు గురువారం రాత్రి బీభత్సం సృష్టించింది. వర్లీ (Varli) నుంచి బాంద్రా (Bandra) వైపు వెళ్తున్న ఓ కారు టోల్ ప్లాజా(Tollplaza) వద్ద పార్కింగ్‌లో ఉంచి కొన్ని కార్లను అతి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సీ లింక్ లో టోల్ ప్లాజాకు 100 మీటర్ల దూరంలో ముందుగా ఇన్నోవా కారు మెర్సిడెస్ కారు ఢీకొట్టింది. వెంటనే మరో రెండు కార్లను బలంగా ఢీకొట్టింది. ఈ విషయం గురించి కృష్ణకాంత్ ఉపాధ్యాయ మీడియాకు వివరించారు. మెర్సిడెస్, ఇన్నోవా కారుతో పాటు మరో ఆరు కార్లు ప్రమాదానికి గురైనట్లు ఆయన తెలిపారు.
Also read: తిరుపతి శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక!
మృతి చెందిన వారిని స్థానిక ప్రభుత్వాసుప్రతికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఒకర్ని లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని భాభా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు వివరించారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఇన్నోవా కారు డ్రైవర్ కూడా ఉన్నట్లు పోలీసులు వివరించారు.
ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తో పాటు, కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ముంబై వర్లీ వంతెన పై ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.