BJP Cabinet Ministers: ముగ్గురు మాజీ సీఎంలకు కేంద్ర మంత్రి పదవులు మోదీ కేబినెట్‌లో బీజేపీకి చెందిన ముగ్గురు మాజీ సీఎంలకు చోటు దక్కినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ నుంచి శివరాజ్ సింగ్ చౌహన్, హర్యానా నుంచి మనోహర్ లాల్ కట్టర్, బస్వరాజు బొమ్మై లకు బెర్త్ ఖరారైంది. అయితే వీరిలో ఒకరికి లోక్ సభ స్పీకర్ పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 09 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి BJP Cabinet Ministers: 2024 లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ ప్రభుత్వ ఏర్పాటుకు బీహార్ సీఎం నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే వీరు మద్దతు తెలపడంతో కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందనే చెప్పాలి. మరోవైపు నితీష్ కుమార్, చంద్రబాబు తమకు మద్దతు తెలపాలని ఇండియా కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్న వారు మాత్రం మోదీ ప్రభుత్వానికే జై కొట్టారు. ఈ నెల 7న జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో మోదీని ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. అనంతరం కేంద్ర మంత్రివర్గంలో ఎవరికీ ఏ స్థానం ఇవ్వాలని చర్చలు మొదలు పెట్టింది. తాజాగా మంత్రివర్గ కూర్పు కొలిక్కి వచ్చింది. ఈ క్రమంలోనే ఈ రోజు మోదీతో కలిసి ప్రమాణ స్వీకారం చేసేందుకు మంత్రివర్గంలో చోటు దక్కిన వారికి బీజేపీ హైకమాండ్ ఫోన్ కాల్స్ చేసింది. ఇందులో భాగంగా ఈ రోజు 11. 30 గంటలకుకేంద్ర ప్రభుత్వ కేబినెట్ మంత్రులకు తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే మోదీ కేబినెట్ లో బీజేపీకి చెందిన ముగ్గురు మాజీ సీఎంలకు చోటు దక్కినట్లు సమాచారం. మధ్యప్రదేశ్ నుంచి శివరాజ్ సింగ్ చౌహన్, హర్యానా నుంచి మనోహర్ లాల్ కట్టర్, బస్వరాజు బొమ్మై లకు బెర్త్ ఖరారైంది. అయితే వీరిలో ఒకరికి లోక్ సభ స్పీకర్ పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. #union-ministers #bjp-cabinet-ministers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి