Mumbai : బాంబులు వేస్తాం..అప్రమత్తంగా ఉండండి.. మ్యూజియంలను పేల్చివేస్తామని బెదిరింపు కాల్స్.! దేశంలోని ఆర్థిక నగరమైన ముంబైలోని కొలాబా వర్లీ , ఇతర ప్రదేశాలలో ఉన్న ప్రధాన మ్యూజియంలకు శుక్రవారం పేలుడు బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ మ్యూజియంలను పరిశీలించారు. అయితే పేలుడు పదార్థాల జాడ మాత్రం లభించలేదు. By Bhoomi 06 Jan 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి మహారాష్ట్ర(Maharashtra)లోని పలు మ్యూజియంలపై ఏకకాలంలో బాంబులు వేస్తామంటూ బెదిరింపు మెయిల్స్(Threatening mails) రావడంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబై పోలీసులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్(Bomb Disposal Squad)తో కలిసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు ఇమెయిల్ రావడంతో పోలీసులు యాక్టివ్ అయ్యారు. వర్లీ, కోలాబా సహా పలు ప్రాంతాల్లో అలర్ట్ జారీ చేశారు. ఇంతలో, బెదిరింపు ఇమెయిల్‌పై ముంబై పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సైట్‌లో పేలుడు జరిగినట్లు ఎటువంటి ఆనవాలు కనిపించలేదు. అయితే, ఈమెయిల్ ద్వారా బెదిరించిన వ్యక్తి కోసం పోలీసులు ఇప్పుడు వెతకడం ప్రారంభించారు. ప్రధాన మ్యూజియంలపై బాంబులు వేస్తాం: బెదిరింపు ఇమెయిల్‌లో కొలాబాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం(Chhatrapati Shivaji Maharaj Museum), వర్లీలోని నెహ్రూ సైన్స్ సెంటర్(Nehru Science Center)తో సహా ప్రధాన మ్యూజియంలపై బాంబులు వేస్తామని బెదిరించారు. దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు, "పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఆ మ్యూజియంలను తనిఖీలు చేపట్టాయి. ఆ ప్రదేశంలో ఎటువంటి పేలుడు పదార్థాల జాడ కనుగొనబడలేదని పోలీసులు తెలిపారు. Mumbai: Major museums including the Chhatrapati Shivaji Maharaj Museum in Colaba and Nehru Science Center in Worli received emails threatening a blast. Police and bomb disposal squad investigated the museums which received the emails. No trace of any explosives was found: Mumbai… — ANI (@ANI) January 5, 2024 సంఘటనా స్థలానికి క్విక్ రియాక్షన్ టీమ్: పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మ్యూజియంలో పలు బాంబులు అమర్చినట్లు ఈ-మెయిల్ లో వచ్చింది. మెయిల్ చూసిన వెంటనే ముంబై పోలీసు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో పాటు స్నిఫర్ డాగ్‌లు, క్విక్ రియాక్షన్ టీమ్‌ను కూడా సంఘటనా స్థలానికి పంపారు. దీంతో పాటు మ్యూజియం చుట్టూ పోలీసు బృందాన్ని మోహరించారు. ఇ-మెయిల్ ద్వారా బెదిరింపుకు సంబంధించి కేసు నమోదు చేసిన తర్వాత, ముంబై పోలీసులు సైబర్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఇ-మెయిల్ పంపిన వ్యక్తి యొక్క స్థానాన్ని ట్రాక్ చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఆర్బీఐకి బెదిరింపులు: గతంలో ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంతో పాటు పలు బ్యాంకులపై బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి. అయితే, అక్కడ ఎలాంటి అనుమానాస్పద వస్తువు లేదని తేలింది. ఈ బెదిరింపు కూడా ఈమెయిల్ ద్వారానే పోలీసులకు అందింది. ముకేశ్ అంబానీ కూడా ఇదే తరహాలో చాలాసార్లు బెదిరించారు. ఇది కూడా చదవండి: చరిత్ర సృష్టించేందుకు కొన్ని అడుగుల దూరంలో ఇస్రో..నేడు గమ్యాన్ని చేరుకోనున్న ఆదిత్య-ఎల్1 ..!! #mumbai #threatening-mails మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి