This Week Movies: ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలు ఇవే

ఈ వారం సినీ ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్ లో అదిరిపోయే చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ పలు చిత్రాలు, వెబ్ సీరీస్ లు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

This Week Movies: ఈ వారం థియేటర్, ఓటీటీ  సినిమాలు ఇవే
New Update

This Week Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము..

'రత్నం'

హీరో విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన తాజా చిత్రం 'రత్నం'. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీని సింగం ఫేమ్ దర్శకుడు హరి తెరకెక్కించారు. భరణి, పూజ చిత్రాల తర్వాత విశాల్, హరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. రత్నం తెలుగు, తమిళ్, భాషల్లో ఏప్రిల్ 26న విడుదల కానుంది.

publive-image

రుస్లాన్

కరణ్‌.బి దర్శకత్వంలో ఆయుష్‌ శర్మ, సుశ్రీ మిశ్రా ప్రధాన పాత్రలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ 'రుస్లాన్'. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్ పై కె.కె.రాధామోహన్‌ నిర్మించారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

publive-image

ప్రతినిధి 2

దేవగుప్త దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా లేటెస్ట్ చిత్రం ప్రతినిధి 2. 2014 లో విడుదలైన 'ప్రతినిధి' కి సీక్వెల్ గా ఈ మూవీని రూపొందించారు. కుమార్‌ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేంద్రనాథ్‌ బొల్లినేని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'ప్రతినిధి 2' ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ కనిపించబోతున్నారు.

publive-image

ఓటీటీ సినిమాలు 

నెట్‌ఫ్లిక్స్‌

  • డెడ్‌ బాయ్‌ డిటెక్టివ్స్‌ (వెబ్‌సిరీస్‌) - ఏప్రిల్‌ 25
  • టిల్లు స్క్వేర్‌ - ఏప్రిల్‌ 26

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

  • ఏప్రిల్ 26- కుంగ్‌ఫూ పాండా 4 (యానిమేషన్‌)
  • ఏప్రిల్‌ 25- భీమా (తెలుగు)
  • ఏప్రిల్‌ 26- క్రాక్‌ (హిందీ)
  • ఏప్రిల్‌ 26 - ది బీ కీపర్‌ (హాలీవుడ్‌)

జియో

  • ఏప్రిల్‌ 22 - ది జెనెక్స్‌(వెబ్‌సిరీస్‌)

Also Read: Actor Thiruveer: పెళ్లి పీటలు ఎక్కిన ‘మసూద’ న‌టుడు.. వైరలవుతున్న ఫొటోలు..!

#this-week-movies
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe