Junk Food: ఒత్తిడిలో జంక్ ఫుడ్ తింటే జరిగేది ఇదే!

ఒత్తిడిగా ఉన్నప్పుడు ఉపశమనం కోసం తినే ఆహారంలో ఎక్కువ కేలరీలు గనుక ఉంటే ఒత్తిడి తగ్గదు కదా ఇంకా పెరుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. అధిక కొవ్వు కలిగిన ఆహారం మెదడు రసాయనాలను ప్రభావితం చేస్తుందని కొలరాడో విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల అధ్యయనంలో తేలింది.

Junk Food: ఒత్తిడిలో జంక్ ఫుడ్ తింటే జరిగేది ఇదే!
New Update

Eating Junk Food Under Stress: మనలో ప్రతీ నలుగురిలో ఇద్దరు ఒత్తిడితో ఇబ్బందిపడుతున్నారు.ఉద్యోగం, వ్యాపారం ఇలా ప్రతీది పోటా పోటీగా మారడంతో ఒత్తిడి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.ఈ ఒత్తిడిని ఎదుర్కొనే క్రమంలో రిలీఫ్‌ కోసం సిగరెట్ కాలుస్తారు. అది మంచిది కాదని తెలుసు కాబట్టి కొందరు దాని జోలికి వెళ్ళకుండా తిండి మీద పడతారు. ముఖ్యంగా సమోసా, బర్గర్‌ లాంటి జంక్‌ ఫుడ్‌ తినేందుకు మొగ్గు చూపుతారు.అయితే ఇది మంచి పద్దతి కాదంటున్నారు నిపుణులు.

ఒత్తిడిగా ఉన్నప్పుడు ఉపశమనం కోసం తినే ఆహారంలో ఎక్కువ కేలరీలు గనుక ఉంటే ఒత్తిడి తగ్గదు కదా ఇంకా పెరుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. జంతువులలో జరిపిన అధ్యయనం ప్రకారం, అధిక కొవ్వు కలిగిన ఆహారం గట్ బ్యాక్టీరియాకు అంతరాయం కలిగిస్తుంది. వాటి ప్రవర్తనను మారుస్తుంది. దీనివల్ల ఆందోళనను పెంచే మార్గాల్లో మెదడు రసాయనాలను ప్రభావితం చేస్తుందని కొలరాడో విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల అధ్యయనంలో తేలింది.

ఒత్తిడి, ఆందోళనతో సంబంధమున్న సెరోటోనిన్‌ ఉత్పత్తి వాటిలో ఎక్కువ కావడాన్ని వారు పరిశీలించారు. అధిక కొవ్వులు కలిగిన పదార్ధాలు తీసుకోవడం వల్ల బరువు పెరగడం, గుండె, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులతో పాటు డిప్రెషన్ కు కూడా దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అధిక కొవ్వు కలిగిన ఆహారం న్యూరోసట్రాన్స్మీటర్స్ ద్వారా జరిగే సెరోటోనిన్ ఉత్పత్తి, సిగ్నలింగ్ లో పాల్గొనే మూడు జన్యువులు ఒత్తిడి, ఆందోళనకు కూడా కారణంఅవుతుంది.

Also Read: ఆహారాన్ని నెమ్మదిగా ఎందుకు తినాలి?

#health-tips #junk-food
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe