Dating Secrets: ఫస్ట్ డేట్‌‌లో మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులివే!

ఫస్ట్ డేట్‌లో పార్ట్నర్‌ను ఇంప్రెస్ చేసేలా మాట్లాడాలి. మొదటిసారి ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఏం మాట్లాడాలి, ఎలాంటి విషయాలు మాట్లాడకూడదో తెలుసుకోండి.

Dating Secrets: ఫస్ట్ డేట్‌‌లో మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులివే!
New Update

ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టాలంటే, ముందు వారిద్దరూ ఒకరికొకరు పూర్తిగా అర్థం కావాలి. ఇందుకు పరిచయం ఒక్కటే సరిపోదు. ఆ పరిచయం ఏదైనా బంధంగా మారేందుకు డేటింగ్ ఒక పునాదిగా ఉంటుంది. డేటింగ్ అనేది ఇద్దరు వ్యక్తులు పరిచయాన్ని మించిన కనెక్షన్‌ను కనుగొనే ప్రాసెస్. ఇద్దరు వ్యక్తులు రొమాంటిక్ రిలేషన్‌షిప్‌కి ఎంటర్ అవ్వడానికి ముందు డేటింగ్ చేస్తారు. ఈ దశలో ఇద్దరి అభిప్రాయాలు సింక్ అయితే, బంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రెడీ అవుతారు.

అయితే ఇద్దరు వ్యక్తులు పరిచయమైన తర్వాత, ఎక్కడైనా కలుద్దాం అనుకున్నప్పుడు కాస్త ఆందోళన ఉంటుంది. ఈ ఫస్ట్ డేట్‌ కొందరికి మరపురాని అనుభూతిని మిగిలిస్తే, ఇంకొందరికి పీడకలగా మారవచ్చు. అయితే ఫస్ట్ డేట్‌లో పార్ట్నర్‌ను ఇంప్రెస్ చేసేలా మాట్లాడాలి. మొదటిసారి ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఏం మాట్లాడాలి, ఎలాంటి విషయాలు మాట్లాడకూడదో తెలుసుకోండి.

ఫస్ట్ డేట్‌లో చేయాల్సిన పనులు:

ఫస్డ్ డేట్‌లో ఎదుటి వ్యక్తితో మీ ఆసక్తులు, అభిరుచులను షేర్ చేసుకోవాలి. ఇది మీ ఇద్దరూ మంచి రిలేషన్‌షిప్ ఏర్పరచుకోవడానికి సహాయం చేసే పద్ధతి. ఇది ఫ్యూచర్ డేటింగ్ కోసం మీకు కొన్ని కామన్ ఇంట్రస్ట్‌లు, ఆలోచనలను కూడా అందిస్తుంది. మీ హాబీస్ చెబుతూ, పార్ట్నర్‌ అలవాట్లు అడుగుతూ కమ్యూనికేషన్ ముందుకు తీసుకెళ్లవచ్చు.

ప్రశ్నలు తెలివిగా అడగాలి

ఫస్ట్ డేట్‌లో పార్ట్నర్‌ను పిచ్చి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టకూడదు. డేటింగ్‌పై ఆసక్తి కలిగించే ప్రశ్నలను చాలా క్రియేటివ్‌గా అడగాలి. ఈ సెషన్ మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్స్‌ ముందుకు తీసుకెళ్లే మార్గంగా ఉండాలి. మీరు అడిగే ప్రశ్నల ద్వారా ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకునే వాతావరణం క్రియేట్ చేయాలి. ఇష్టమైన బుక్, టూరిస్ట్ డెస్టినేషన్, మూవీస్ వంటి విషయాల గురించి అడిగితే, కన్వర్జేషన్ ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. మీ ఇద్దరి కామన్ అలవాట్లు, పద్ధతులు కూడా తెలుస్తాయి.

నిజాయితి ముఖ్యం

ఇద్దరి మధ్య కనెక్షన్‌ జెన్యూన్‌గా ఏర్పడాలి. అంటే ఇద్దరి ఒపీనియన్స్ కలవాలి. అందుకే మీరు మీలాగే ఉండాలి. ఫస్ట్ డేట్‌లో మీ ఆట్టిట్యూడ్ ఎదుటి వారికి తెలియాలి. అప్పుడు కనెక్షన్ ఏర్పడితేనే, బంధం ముందుకు సాగుతుంది. అనవసరంగా నటించి, పార్ట్నర్‌ను ఇంప్రెస్ చేసి రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్తు, భవిష్యత్తులో అపార్థాలు ఏర్పడవచ్చు.

లక్ష్యాలు షేర్ చేసుకోండి

మీ లక్ష్యాలు, ఆకాంక్షలను షేర్ చేసుకుంటే, మీ గురించి డేటింగ్ పార్ట్నర్‌కు ఒక అవగాహన వస్తుంది. దీంతో ఇద్దరి మధ్య షేర్డ్ గోల్స్, డ్రీమ్స్ గురించి చర్చలు కొనసాగుతాయి. ఇది మీ కనెక్షన్‌ను బలోపేతం చేస్తుంది.

అబద్ధాలు వద్దు

ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే, నిజాయితీ చాలా ముఖ్యం. మీ డేట్‌లో పార్ట్నర్‌ను ఆకట్టుకోవడానికి మీగురించి డబ్బాలు కొట్టుకోవడం మంచిది కాదు. అలాగే అబద్ధాలు చెప్పి వారిని ఇంప్రెస్ చేయడం సరికాదు. అబద్ధాలతో రిలేషన్‌షిప్‌ ఏర్పరచుకోవడం ఎప్పుడూ మంచిది కాదు.

పర్సనల్ డీటేల్స్ పూర్తిగా షేర్ చేసుకోవద్దు

ఏదైనా రిలేషన్‌షిప్‌లో ఓపెన్‌గా ఉండటం చాటా ముఖ్యం. అయితే ఫస్ట్ డేట్‌లోనే మరీ ఉత్సాహం ప్రదర్శించి, మీ పర్సనల్ విషయాలన్నీ పార్ట్నర్‌తో షేర్ చేసుకోవద్దు. రానున్న రోజుల్లో ఇవి మాట్లాడుకోవచ్చు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిన తర్వాతే గత రిలేషన్‌షిప్స్, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలను వారితో షేర్ చేసుకోవచ్చు.

ఇతరుల గురించి నెగిటివ్‌గా మాట్లాడకూడదు

ఫస్ట్ డేట్‌లో మీ ఎక్స్ పార్ట్నర్, సహోద్యోగులు లేదా స్నేహితులు, ఇతరుల గురించి నెగిటివ్‌గా మాట్లాడటం మానుకోండి. ఇది మీ నెగిటివిటీని రిఫ్లెక్ట్ చేస్తూ, చెడు అభిప్రాయం కలిగిస్తుంది. ఫస్ట్ డేట్‌లో పాజిటివ్ మ్యాటర్స్‌పై మాత్రమే దృష్టి పెట్టాలి.ఫస్ట్ డేట్‌ రొమాంటిక్ మూడ్‌ను రిఫ్టెక్ట్ చేయాలి. కానీ సొంత అభిప్రాయాలు వ్యక్తం చేసే ప్లాట్‌ఫామ్‌గా ఉండకూడదు. అందుకే రాజకీయాలు, మతం, నేరాలు లేదా ఇతర వివాదాస్పద విషయాల గురించి ఫస్ట్ డేట్‌లో మాట్లాడకూడదు. ఈ అంశాలు భిన్నాభిప్రాయాలకు దారితీసి, ఇద్దరి మధ్య అసౌకర్య వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకునే వరకు ఇలాంటి చర్చలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

#relationship #life-style #dating
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe