Car: 2023లో దుమ్ము లేపిన కారు ఇదే.. ధర కేవలం రూ.6 లక్షలే.. ఓ లుక్కేయండి!

suvవాహనాలు అత్యధికంగా భారతీయ మార్కెట్లో మాత్రమే అమ్ముడవుతున్నాయి. ఈ కేటగిరీని పరిశీలిస్తే..మైక్రో, మినీ, కాంపాక్ట్, సబ్ కాంపాక్ట్, మిడ్ సైజ్, ఫుల్ సైజ్ ఎస్ యూవీలు ఇండియాలో అమ్ముడుపోతున్నాయి. మైక్రో ఎస్ యూవీ సెగ్మెంట్ లో టాటా కారు దూకుడుమీదుంది.

New Update
Car: 2023లో దుమ్ము లేపిన కారు ఇదే.. ధర కేవలం రూ.6 లక్షలే.. ఓ లుక్కేయండి!

ప్రతి సెగ్మెంట్లో ఏదొక కారు తన సత్తా ఏంటో నిరూపిస్తున్నాయి. అయినప్పటికీ తక్కువ ధర కారణంగా మైక్రో ఎస్ యూవీ వాహనాలు బాగా అమ్ముడుపోతున్నాయి. వాటి విక్రయాలు ఇతర విభాగాల వాహనాలను వెనక్కు నెట్టుతున్నాయి. ఈ కారణంగా ఈ విభాగంలో కొత్త మోడల్స్ ను రిలీజ్ చేసేందుకు కంపెనీల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం మైక్రో ఎస్ యూవీ సెగ్మెంట్ లో టాటా కారు ఆధిపత్యం చెలాయిస్తోంది. చాలా మంది ఈ కారును ఎంతగానో ఇష్టపడుతున్నారు. దీని కారణంగా మారుతీ వాహనాల మైలేజీని కూడా మర్చిపోయారు. పూర్తి ఫీచర్లతో ఈ మధ్యే రిలీజ్ చేసిన హ్యుందాయ్ ఎక్స్ టర్ కూడా దీనితో పోటీపడలేకపోయింది.

ఇక మనం టాటా పంచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే..ఈ కారు అమ్మకాలు దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్ యూవీగా మార్చాయి. పంచ్ అమ్మకాలను పరిశీలించినట్లయితే గత 6 నెలల్లో మొత్తం 80,268 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదే సమయంలో ఈ ఎస్ యూవీ సగటు ప్రతి నెలా 13, 378 యూనిట్లు సేల్ అవుతున్నాయి.

టాటా పంచ్ ను సవాలు చేసే హ్యుందాయ్ ఎక్స్ టర్ గురించి జులై 2023లో ప్రారంభించిన తర్వాత గత 5నెలల్లో కేవలం 39,499యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ప్రతినెలా ఎక్సెటర్ సగటు అమ్మకాలు 7,899 యూనిట్లు మాత్రమే. టాటా పంచ్ గురించి మాట్లాడినట్లయితే కంపెనీ దీనిని పెట్రోల్ తో పాటు సీఎన్జీ మోడల్ లో అమ్ముతోంది. దీని అతిపెద్ద ఫీచర్ 5స్టార్ జినాప్ రేటింగ్,అద్భుతమైన బలం, నాణ్యతను రుజువు చేస్తోంది. ఈ 5సీటర్ మినీ ఎస్ యూవీ ధర రూ. 6లక్షల నుంచి మొదలై రూ. 9.52 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరతో 5స్టార్ సేఫ్టీ రేటింగ్ తో వచ్చే ఇతర వాహనం మార్కెట్లో లేదు.

టాటా మోటార్స్ పంచ్ లో కస్టమర్ సేఫ్టితో పాటు కంపర్ట్, ఫీచర్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. దాని కొత్త మోడళ్లతో ఈ ఎస్ యూవీ వాయిస్ యాక్టివేటెడ్ ఎలక్ట్రిక్ సర్ రూఫ్ తో కూడా వస్తోంది. క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా దీని టాప్ వేరియంట్లలో అందుబాటులో ఉండగా...స్టాండర్డ్ ఫీచర్ల గురించిప్రత్యేకించి చర్చించుకుంటే ఇందులో మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, పవర్ అడ్జస్టబుల్ ఎక్స్ టీరియల్ రియర్ వ్యూ మిర్రర్, టచ్ స్క్రీన్ , ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోలో ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, అల్లాయ్ వీట్స్, ఫాగ్ లైట్లు, పవర్ విండోస్, వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక సేఫ్టీ పరంగా చూసినట్లయితే...ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు ఈబీడీతో కూడా ఏబీఎస్ బ్యాక్ డీఫాగర్, బ్యాక్ పార్కింగ్ సెన్సార్, బ్యాక్ వ్యూ కెమెరా, చైల్డ్ సీట్ యాంకర్ వంటి ఫీచర్లతో ఉంది. అంతేకాదు ఈ ఎస్ యూవీలో 366 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంది.

టాటా పంచ్ ప్యూర్, అడ్వెంచర్, అకాప్లిప్డ్, క్రియేటవిట్ అనే నాలుగు వేరియంట్స్ లో పరిచయమైంది. దీని కొత్త కామో వెర్షన్, అడ్వెంచర్, అకాంప్లిప్డ్ ట్రిమ్స్ లో అందుబాటులో ఉంది. పంచ్ లో 1.2లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 88 బీహెచ్ పీ శక్తీని, 115 ఎన్ఎం టార్క్ ను ప్రొడక్ట్ చేస్తుంది. ఇంజిన్ కు 5 స్పీడ్ మ్యానువల్ 5 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ ఉంది. సీఎన్జీ వెర్షన్ లో ఈ కారు 73.5 బీహెచ్ పీ శక్తిని కూడా ప్రొడక్ట్ చేస్తుంది. మైలేజీ గురించి ప్రత్యేకించి మాట్లాడితే ఇది పెట్రోల్ వెర్షన్ లో లీటర్ కు 30. 09 కి.మీ. సీఎన్జీ లో కిలోకు 26.99 కి.మి మైలేజీని అందిస్తుంది.

ఇది కూడా చదవండి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ..ఏమన్నారంటే..?

Advertisment
తాజా కథనాలు