Car: కేవలం రూ.5 లక్షలకే అదిరిపోయే కార్.. ఓ లుక్కేయండి..!!

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేందుకు...తక్కువ ధరలకే కార్లను మార్కెట్లోకి పరిచయం చేస్తున్నాయి. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లతో ఎన్నో కార్లు ఇప్పటికే మార్కెట్లోకి విడుదలయ్యాయి. అందులో మారుతి స్విఫ్ట్ ఒకటి. ఈ కారును ఇష్టపడనివారుండరు. సేఫ్టీ పరంగా, డ్రైవింగ్ పరంగా ఈ కారును ఇష్టపడని వారు కొందరు ఉన్నారు. ఫీచర్లు, పనితీరు పరంగా ఈ కారుకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. అయితే దీన్ని మించిన మరో కారు ఏదైనా ఉందా? చూద్దాం.

Car: కేవలం రూ.5 లక్షలకే అదిరిపోయే కార్.. ఓ లుక్కేయండి..!!
New Update

భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల గురించి తెలుసుకుంటే...ఆగస్టు నెలలో మారుతీ స్విఫ్ట్ దేశంలోనే నెంబర్ వన్ కారుగా నిలిచింది. ఈ నెలలో 18,653 యూనిట్లు అమ్ముడయినట్లు కంపెనీ తెలిపింది. అమ్మకాల పరంగా అగ్రస్థానంలో నిలిచినప్పటికీ...సేఫ్టీ పరంగా మాత్రమే కస్టమర్లను నిరాశపరిచింది. ముఖ్యంగా కారు కొనుగోలు చేయాలంటే ముందుగా ఆలోచించేది సేఫ్టి గురించి. అలాంటి భద్రత గురించి మనం చర్చించినట్లయితే...గ్లోబర్ ఎన్సీఏపి క్రాష్ టెస్టులో స్విఫ్ట్ 1 స్టార్ రేటింగ్ ను మాత్రమే పొందింది. ఈ కారు ధరలు రూ. 5.99 లక్షల నుంచి ప్రారంభమై...రూ. 9.03లక్షల వరకు సేల్ అయ్యాయి.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అలర్ట్…600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల దరఖాస్తులకు నేడే చివరి తేదీ…!!

అయితే ఈ కారును ఫీచర్లు, పనితీరు పరంగా చాలా మంది ఇష్టపడతారు. కానీ సేఫ్టీ, డ్రైవింగ్ పరంగా మాత్రం కొంతమందిని ఈ కారును రిజక్ట్ చేస్తున్నారు. మీరు కూడా కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే...మీ బడ్జెట్ తక్కువగా ఉంటే ...మనం కొన్ని ఎస్ యూవీల గురించి తెలుసుకుందాం.

టాటా పంచ్:
ఈకారు భారత్ లాంచ్ అవ్వడంతోనే ఎంతో ప్రజాధారణ పొందింది. ఈ కారు డిజైన్ కస్టమర్లను అట్రాక్ట్ చేసింది. మైలేజ్ పరంగా పంచ్ మంచి మార్కులను కొట్టేసింది. ఈ కారు ధర రూ. 6 లక్షలతో ప్రారంభమై రూ. 9.52 లక్షల వరకు ఉంటుంది. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ తో వచ్చింది. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లు ఉండటంతో పంచ్ దాని విభాగంలో మిగతా ఎస్ యూవీల కంటే మంచి ప్రారంభాన్ని ఇస్తోంది. అంతేకాదు అదే ధరలు ఉన్న హ్యాచ్ బ్యాక్ కార్లకు కూడా గట్టి పోటీనిస్తుంది. సైజులో చిన్నగా ఉన్నా..ఐదుగురు సులభంగా ప్రయాణించవచ్చు.

ఇది కూడా చదవండి: మహిళలూ బంగారం కొనేందుకు ఇదే మంచి ఛాన్స్…తులం ఎంత తగ్గిదంటే..!!

ఇక ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజీన్ 88 బీహెచ్ పి శక్తిని 115 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మ్యానువల్ తోపాటు 5 స్పీడ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్ కూడా ఉంది. ఇది ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో కూడా సీఎన్జీ వేరియంట్ ను కూడా రిలీజ్ చేసింది. టాటా పంచ్ పెట్రోల్లో 20.9 కిలోమీటర్లు, సీఎన్జీలో 26.99కిలో మీటర్ల మైలేజీని ఇస్తుంది.

ఇక పంచ్ 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే తోపాటు, సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ ప్యానెల్, ఆటో ఎయిర్ కండిషనింగ్, ఆటోమెటిక్ హెడ్ లైట్స్ , కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్ తో పాటు మరిన్ని ఫీచర్లను కలిగి ఉంది.

#car #maruti-suzuki #tata-car #best-suv #punch
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe