/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Ram-Charan-favorite-dish.-Miss-Shetty-Mr-Polishetty.-movie-2-jpg.webp)
తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్ అనుష్క, 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' రెసిపీ ఛాలెంజ్ ప్రారంభించింది. అనుష్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఈ ఛాలెంజ్ ఇవ్వగా..ఆయన స్వీకరించి తనకు ప్రాన్స్ పలావ్ ఇష్టమని చెబుతూ ఎలా తయారు చేయాలో వివరించారు. ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్‌ను మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు ఫార్వార్డ్ చేశాడు ప్రభాస్.
I'm up for the challenge & here's my entry for the #MSMPRecipeChallenge.
my favorite #ChepalaPulusuI invite @RanaDaggubati to join the fun :))
Here’s wishing the team of #MissShettyMrPolishetty all the very best for tomorrow's release.@MsAnushkaShetty @NaveenPolishety… pic.twitter.com/rQxWYldXpj
— Ram Charan (@AlwaysRamCharan) September 6, 2023
ప్రభాస్ ఛాలెంజ్‌ను తీసుకున్న రామ్‌చరణ్ తన ఫేవరేట్ డిష్ నెల్లూరు చేపల పులుసు అని చెబుతూ, అదెలా తయారు చేయాలో వివరించాడు. ఈ సందర్భంగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు తన బెస్ట్ విశెస్ తెలిపారు రామ్ చరణ్.
అంతకంటే ముందు అనుష్క తనకు ఇష్టమైన వంటకాల్ని వెల్లడించింది. మంగళూరు చికెన్ కర్రీ, మంగళూరు స్పెషల్ నీర్ దోస అంటే తనకు చాలా ఇష్టమని తెలిపిన బొమ్మాళి.. అవి ఎలా తయారు చేయాలో తన సోషల్ మీడియా అక్కౌంట్‌లో పోస్ట్ చేసింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్‌ను మొదటగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు విసిరింది. ప్రభాస్ ఎంత ఫుడ్ లవర్ అనేది అందరికీ తెలుసు. ఆయన ఇష్టంగా తినడమే కాదు..తన కో-స్టార్స్‌కు, స్నేహితులకు మంచి మంచి వంటలు రుచి చూపిస్తుంటాడు. అందుకే ఫస్ట్ ప్రభాస్ ఈ ఛాలెంజ్ ను స్వీకరించాడు.
తనకు రొయ్యల పలావ్ అంటే ఇష్టమని చెబుతూ ఎలా తయారు చేయాలో వివరించాడు. ఎంతోకాలంగా అనుష్కతో తనకు పరిచయం ఉన్నా ఆమె ఫేవరేట్ డిష్ తనకు తెలియదని, ఇప్పుడు తెలిసిందని ప్రభాస్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్‌ను రామ్ చరణ్‌కు ఫార్వార్డ్ చేశాడు ప్రభాస్. తాజాగా రామ్ చరణ్ కూడా స్పందించి, తనకు ఇష్టమైన వంటకాన్ని షేర్ చేశాడు. నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.