Australia Captain For T20 World Cup: ఐపీఎల్ 2024లో ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించబోతోంది. వెస్టిండీస్, అమెరికా ఈ మెగా టోర్నమెంట్‌కు సంయుక్తంగా ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి. జూన్ 2వ తేదీన టోర్నమెంట్ ఆరంభమౌతుంది. 29వ తేదీ వరకు కొనసాగుతుంది. వెస్టిండీస్, అమెరికాల్లో మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్‌లు షెడ్యూల్ కానున్నాయి. డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్.. ఇందులో ఉన్నాయి. ఈ సారి ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఓ టోర్నమెంట్‌లో ఒక్క టైటిల్ కోసం 20 జట్లు పోటీ పడటం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు.
ఇందులో ఆడబోయే దేశాల క్రికెట్ బోర్డులన్నీ కూడా తమ ప్లేయర్ల వివరాలను నేటితో వెల్లడించాల్సి ఉంది. గడువులోగా ఈ జాబితాను ఐసీసీకి అందజేయాల్సి ఉంది. ఫలితంగా ఒక్కో దేశం తమ జాతీయ జట్లను ప్రకటిస్తూ వస్తోన్నాయి. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తమ ప్లేయర్ల వివరాలను విడుదల చేశాయి. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా (Australia).. జట్టును ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన ప్లేయర్ల వివరాలను వెల్లడించింది. కొందరు సీనియర్లకు జట్టులో చోటు దక్కలేదు. టీ20 వరల్డ్ కప్ ఆడే జట్టులో స్టీవెన్ స్మిత్‌ను (Steve Smith) తీసుకోలేదు. అతణ్ని పక్కనపెట్టారు. మ్యాట్ షార్ట్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్‌లెట్‌నూ తప్పించారు.
Also Read: రాహుల్‌ను భారత ప్రధాని చేయాలని పాకిస్తాన్ కోరుకుంటోంది- పీఎం మోదీ
ఐపీఎల్‌లో ఢిల్లీ కేపిటల్స్ తరఫున మెరుపులు మెరిపిస్తోన్న జేక్ ఫ్రేజర్ మెక్-గుర్క్‌పైనా అంచనాలు తప్పాయి. అతని బ్యాటింగ్ స్పీడ్ చూసి- టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కడం ఖాయమంటూ వార్తలొచ్చినప్పటికీ- అది వాస్తవ రూపాన్ని దాల్చలేదు. ఒక్క టీ20 ఇంటర్నేషనల్ కూడా ఆడకపోవడం వల్లే అతన్ని జట్టులోకి తీసుకోవడం సాధ్యపడలేదని చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ చెప్పారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న సీనియర్ పాట్ కమ్మిన్స్ (Pat Cummins) చేతికి పగ్గాలను ఇవ్వలేదు క్రికెట్ ఆస్ట్రేలియా. కెప్టెన్‌గా డాషింగ్ మిఛెల్ మార్ష్‌ను (Michelle Marsh) అపాయింట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఏడాది భారత్‌లో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాను ఛాంపియన్‌గా నిలిపింది పాట్ కమ్మిన్సే. అయినప్పటికీ కేప్టెన్‌గా అతన్ని తప్పించింది. జట్టులో చోటు ఇచ్చింది.
టీ20 వరల్డ్ కప్ 2024 ఆడబోయే ఆస్ట్రేలియా జట్టులో- మిచెల్ మార్ష్ (కేప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా ఉన్నారు.