Atchutapuram : అచ్యుతాపురం పేలుడు ఘటనపై సంచలన నివేదిక అచ్యుతాపురం పేలుడు ఘటనపై థర్డ్ పార్టీ రిపోర్ట్ కీలక విషయాలను బయటపెట్టింది. యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తేల్చింది. గతంలో పైప్ లైన్‌ను తరచూ తనిఖీ చేసే సిస్టమ్ వెంటనే ఫ్యాక్టరీలో ఏర్పాటు చేయాలని చెప్పినా.. దానిని యాజమాన్యం పట్టించుకోలేదని చెప్పింది. By V.J Reddy 23 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Atchutapuram Blast : అచ్యుతాపురం (Atchutapuram) లో జరిగిన రియాక్టర్ పేలుడు (Reactor Blast) ఘటనపై థర్డ్ పార్టీ కీలక విషయాలను బయటపెట్టింది. యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు నివేదికలో తెలిపింది. సంస్థలో ఉన్న లోపాలను గత ఏడాది ఇచ్చిన నివేదికలోనే చెప్పినట్లు థర్డ్ పార్టీ నివేదిక పేర్కొంది. గత నివేదికలో పైప్ లైన్‌ను తరచూ తనిఖీ చేసే సిస్టమ్ వెంటనే ఫ్యాక్టరీలో ఏర్పాటు చేయాలని చెప్పమని.. కానీ తాము ఇచ్చిన నివేదికను పట్టించుకోకుండా యాజమాన్యం పక్కకు పెట్టిందని తెలిపింది. బుధవారం మధ్యాహ్నం పైప్ లైన్ నుంచి సాల్వెంట్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు వెల్లడించింది. సాల్వెంట్ (Solvent) చాలా డేంజర్ అని.. దీనికి పెట్రోల్ కంటే వేగంగా అంటుకునే శక్తి ఉందని పేర్కొంది. గాలిలోకి వెళ్లి వేపర్ క్లౌడ్ న్యూట్రల్ స్థాయిని దాటడంతో ఒక్కసారిగా పేలుడు జరిగిందని తెలిపింది. భారీ శబ్దాలు రావడంతో పేలుడు సంభవించినట్లు అర్థమైందని పేర్కొంది. పైప్ లైన్‌ను తరచూ చెక్ చేసే సిస్టం లేకపోవడం.. వెంటనే ఆ సిస్టమ్ ను డెవలప్ చేసుకోవాలని థర్డ్ పార్టీ ఇచ్చిన నివేదికను అమలు చేయకుండా పక్కకు పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కనీసం ఆ నివేదికను అమలు చేయాలని కూడా డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చెప్పలేదు. ఏది ఏమైనా ఈ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల 18 మంది ప్రాణాలు కోల్పోగా, 40 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇప్పటికే యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. Also Read : డాక్టర్ హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీ #reactor-blast #atchutapuram #solvent మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి